Chhota Rajan : గ్యాంగ్ స్టార్ చోట రాజన్ బైలు మంజూరు చేసిన ముంబై హైకోర్టు
ఛోటారాజన్ ముఠాలోని ఇద్దరు సభ్యులు ఆయనను కాల్చిచంపారు.
Chhota Rajan : గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ కు ముంబై హైకోర్టు బుధవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. 2001లో హోటల్ యజమాని జయాశెట్టి హత్య కేసులో దోషిగా ఆయనకు ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. ఆ యావజ్జీవ జైలుశిక్షను ముంబై హైకోర్టు బుధవారంనాడు రద్దు చేస్తూ ఆయనకు బెయిలు మంజూరు చేసింది. న్యాయమూర్తులు రేవతి మోహితే దేరే, పృధ్వీరాజ్ చవాన్‌తో కూడిన ధర్మాసనం లక్ష రూపాయల బెయిల్ బాండ్ సమర్పించాలని ఛోటారాజన్‌ను ఆదేశించింది. అయితే ఛోటారాజన్(Chhota Rajan)పై ఇతర క్రిమినల్ కేసులు ఉన్నందున ఆయన జైలులోనే ఉండాల్సి ఉంటుంది.
Chhota Rajan Case…
సెంట్రల్ ముంబైలోని గాందేవిలో గోల్డెన్ క్రౌన్ హోటల్ యజమానిగా ఉన్న జయాశెట్టి 2001 మే 4న హోటల్ ఫస్ట్ ఫ్లోర్‌లో హత్యకు గురయ్యారు. ఛోటారాజన్ ముఠాలోని ఇద్దరు సభ్యులు ఆయనను కాల్చిచంపారు. రాజన్ గాంగ్ సభ్యుడు హేమంత్ పూజారి డబ్బుల కోసం జయశెట్టిని బెదిరించాడని, ఆయన ఇవ్వడానికి నిరాకరించడంతో హత్య చేశారని విచారణలో తేలినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఛోటారాజన్(Chhota Rajan), మరికొందరికి ప్రత్యేక కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. తనకు విధించిన శిక్షను రద్దు చేసి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఛోటారాజన్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులోనే హైకోర్టు తాజా తీర్పు ఇచ్చింది. వెటరన్ క్రైమ్ రిపోర్టర్ జే డే హత్య కేసులో రాజన్ ఇప్పటికే ఢిల్లీలోని తీహార్ జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు.
కాగా, 1997లో కాల్చివేతకు గురైన ముంబై ట్రేడ్ యూనియన్ నేత డాక్టర్ దత్తా సామంత్ కేసులో గత ఏడాది సీబీఐ ప్రత్యేక కోర్టు ఛోటా రాజన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. హత్యకు ఛోటా రాజన్ కుట్ర పన్నారనడానికి సరైన సాక్ష్యాలు లేవంటూ కోర్టు ఈ తీర్పునిచ్చింది. 2015లో ఇండోనేసియాలో రాజన్‌ను అరెస్టు చేసి ముంబై తీసుకువచ్చారు. ఆయనపై ఉన్న పెండింగ్ కేసులన్నీ సీబీఐకి బదిలీ చేశారు.
Also Read : WHO : దేశంలో 77 శాతం చిన్న పిల్లలకు పౌష్టికాహార లోపం..ఆ రాష్ట్రాల్లో బాగా..