Ganguly Vs Morgan : సౌర‌వ్ గంగూలీ వ‌ర్సెస్ ఇయాన్ మోర్గాన్

అజ‌హ‌రుద్దీన్ లేని చారిటీ మ్యాచ్

Ganguly Vs Morgan : మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ భార‌త క్రికెట్ జ‌ట్టులో స‌త్తా చాటిన ఆట‌గాడు. ముంబై ఆధిప‌త్యాన్ని ప్ర‌శ్నించాడు. ఆపై జ‌ట్టుకు విజ‌యాలు అందించాడు. బ్యాట‌ర్ గా, ఫీల్డ‌ర్ గా అత‌డిని మించిన ఆట‌గాడు ఇంకా రాలేదు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది ట్రై చేస్తూనే ఉన్నారు అత‌డి లాగా రిస్టీ షాట్స్ ఆడాల‌ని. కానీ గుండ‌ప్ప విశ్వ‌నాథ్ , అజ‌హ‌రుద్దీన్ , డేవిడ్ గోవ‌ర్ , జ‌హీర్ అబ్బాస్ ల‌కు మాత్ర‌మే సాధ్య‌మైంది.

ల‌క్ష్మ‌న్ కూడా ట్రై చేశాడు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. ఇది ప‌క్క‌న పెడితే ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ సంద‌ర్భంగా బీసీసీఐ కేంద్రం కోసం చారిటీ మ్యాచ్ ఆడ‌నుంది.

బీసీసీఐ బాస్ గా ఉన్న గంగూలీని ఒక‌ప్పుడు అజ‌హ‌రుద్దీన్ సార‌థ్యంలోనే ఎంట్రీ ఇచ్చాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే పేరొందిన ఆటగాళ్ల‌ను ప‌రిచ‌యం చేసింది అజ్జూ భాయ్ నే.

ఇండియా మ‌హరాజాస్ జ‌ట్టుకు గంగూలీ కెప్టెన్ గా ఉంటే వ‌ర‌ల్డ్ జెయింట్స్ కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మోర్గాన్(Ganguly Vs Morgan) ఉన్నాడు.

ఇక ఇండియా మ‌హ‌రాజాస్ జ‌ట్టులో గంగూలీ, సెహ్వాగ్ , కైఫ్ , ప‌ఠాన్ , బ‌ద్రీనాథ్ , ఇర్ఫాన్ ప‌ఠాన్ , పార్థివ్ ప‌టేల్ , బిన్నీ, శ్రీ‌శాంత్ , హ‌ర్భ‌జ‌న్ సింగ్ , ఓజా , దిండా, ప్రజ్ఞాన్ ఓజా, అజ‌య్ జ‌డేజా, ఆర్పీ సింగ్ , జోగింద‌ర్ శ‌ర్మ‌, రితేంద‌ర్ ఉన్నారు.

ఇక వ‌ర‌ల్డ్ జెయింట్స్ జ‌ట్టుకు మోర్గాన్ కెప్టెన్. సిమ‌న్స్ , వెటోరీ, క‌లిస్ , వాట్స‌న్ , ప్రియ‌ర్ , మెక‌ల్ల‌మ్ , జాంటీ రోడ్స్ , ముర‌ళీధ‌ర‌న్ , డేల్ స్టెయిన్ , హోమిల్ట‌న్ , అస్గ‌ర్ , జాన్సన్ , బ్రెట్ లీ, ఓ బ్రెయిన్ , రామ్ దిన్ ఉన్నారు.

Also Read : జూలో పులులున్నా ద్ర‌విడ్ పైనే ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!