Gates Foundation Anounces : గేట్స్ ఫౌండేష‌న్ భారీ విరాళం

పేద‌రిక నిర్మూల‌న‌..ప‌ర్యావ‌ర‌ణ రక్షణ

Gates Foundation Anounces : బిల్ గేట్స్ ఫౌండేష‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న పేదిరికాన్ని నిర్మూలించ‌డం, ప‌ర్యావ‌ర‌ణ మార్పుల‌కు అనుగుణంగా పోరాడేందుకు గాను గేట్స్ ఫౌండేష‌న్ $1.27 బిలియ‌న్ల స‌హాయాన్ని(Gates Foundation Anounces) ప్ర‌క‌టించింది.

ఫౌండేష‌న్ త‌న వార్షిక గోల్ కీప‌ర్స్ నివేదిక‌లో 2030 నాటికి యుఎన్ సుస్థిర అభివృద్ది ల‌క్ష్యాల సూచిక ట్రాక్ లో లేద‌ని పేర్కొన్న వారం త‌ర్వాత ఆర్థిక నిబ‌ద్ద‌త‌పై ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేష‌న్ త‌న రెండు రోజుల ఈవెంట్ ముగింపు స‌మావేశంలో కీల‌క ప్ర‌క‌ట‌న వెలువుడింది. పేదరికం, సామాజిక అస‌మాన‌త‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ఈ భారీ మొత్తాన్ని విరాళంగా(Gates Foundation Anounces) ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపారు.

ఈ ఈవెంట్ లో 300 మంది యువ‌కులు పాల్గొన్నారు. ప్ర‌పంచం ముందు ఎన్నో స‌వాళ్లు ఉన్నాయి. ప్ర‌ధానంగా పేద‌రికం, అస‌మానత‌, వాతావ‌ర‌ణ మార్పుల‌తో స‌హా పాతుకు పోయిన స‌మ‌స్య‌ల‌కు దీర్ఘ‌కాలిక ప‌రిష్కారాలు చూపేందుకు వీటిని ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

ప్ర‌పంచంలో చోటు చేసుకున్న సంక్షోభాల‌ను ఈ నిధులు ప‌రిష్క‌రించేందుకు దోహ‌దం చేయ‌నున్న‌ట్లు అభిప్రాయ‌పడింది బిల్ గేట్స్ మిలిండా ఫౌండేష‌న్. న్యూయార్క్ లోని లింక‌న్ సెంట‌ర్ లో రెండు రోజుల పాటు యుఎన్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీ వార్షిక సెష‌న్ తో స‌మానంగా జ‌రిగింది.

ప్ర‌తి చోటా స‌వాళ్లు ఎదుర‌వుతూనే ఉన్నాయి. వీటిని ప్రాధాన్య‌తా క్ర‌మంలో ప‌రిష్క‌రించేందుకు గాను వీటిని ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

అవి గ్రాస్ రూట్ లెవ‌ల్ వ‌ర‌కు వెళితేనే స‌రైన న్యాయం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు గేట్స్ ఫౌండేష‌న్ సిఇఓ మార్క్ సుజ్మాన్.

Also Read : రిచ్ లిస్ట్ లో నేహా నార్ఖేడ్ రికార్డ్

Leave A Reply

Your Email Id will not be published!