Gautam Adani : అదానీ కోల్ మొఘల్ గ్రీన్ ఛాంపియన్
వరల్డ్ లో 3వ అత్యంత సంపన్నుడు
Gautam Adani : ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడిగా పేరొందిన అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతం అదానీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఆపై కోల్ (బొగ్గు) మొఘల్ నుండి గ్రీన్ ఛాంపియన్ గా నిలిచారు.
ఏకైక బొగ్గు వ్యాపారి కానప్పటికీ అత్యంత బిలియనీర్ గా, దేశంలో ప్రభావంతమైన వ్యాపారవేత్తలలో ఒకడిగా ముందంజలో ఉన్నారు అదానీ. ఆయన వ్యాపారం దేశాన్ని దాటి ఖండాంతరాలకు విస్తరించింది.
పోర్టులు, బొగ్గు, ఐరన్ , ఎయిర్ పోర్ట్ లు, పవర్, టెలికాం , తదితర రంగాలన్నింట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం విస్మరించ లేని కరోడ్ పతిగా ఉన్నారు.
అదానీ ప్రపంచ వేదికపై తనను తాను తిరిగి ఆవిష్కరించు కోవాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఆయనకు భారత ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంది.
పలు దేశాధినేతలతో ఆయన సమావేశం కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల శ్రీలంకలో తనకు వ్యాపారం ఇచ్చేలా మోదీ జోక్యం చేసుకున్నారంటూ వచ్చిన ఆరోపణలు కొద్దిగా మైనస్ పాయింట్ అయినప్పటికీ తనదైన శైలిలో ముందుకు వెళ్లారు.
ప్రస్తుతం అదానీ(Gautam Adani) కంపెనీకి సంబంధించిన షేర్లు ఉన్నట్టుండి పెరిగాయి. అంతకంతకూ లాభాలు ఆర్జించి పెడుతున్నాయి. ఇటీవల ప్రకటించిన ఆయన ఆస్తి విలువ $143 బిలియన్లకు పెరిగింది.
ప్రపంచ కుబేరుల్లో టెస్లా సిఇఓ, చైర్మన్ అయిన ఎలోన్ మస్క్ ముందంజలో ఉండగా అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక భారత్ కు చెందిన గౌతం అదానీ మూడో స్థానంలో నిలిచారు.
Also Read : పీపీఎఫ్ లో జమ బతుక్కి ధీమా