Gautam Adani : సౌదీ కంపెనీతో అదానీ గ్రూప్

ముఖేశ్ వ‌దులుకున్న కంపెనీపై క‌న్ను

Gautam Adani  : భార‌తీయ ప్ర‌ముఖ వ్యాపార దిగ్గ‌జం అదానీ మ‌రో అడుగు ముందుకేశారు. సౌదీలోని ప్ర‌ముఖ కంపెనీ ఆరామ్ కోతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పీఐఎఫ్ వాటాలో కొంత భాగాన్ని కొనుగోలు చేసేందుకు గాను అదానీ గ్రూప్ చ‌ర్చించింది.

సౌదీ అరేబియాలో భాగ‌స్యామ్యాల‌ను పెంపొందించుకునే ప‌నిలో ప‌డింది. ఇందులో ప్ర‌పంచంలోనే అతి పెద్ద చ‌మురు ఎగుమ‌తిదారుగా ఉన్న ఆరామ్ కో కంపెనీలో వాటాల‌ను కొనుగోలు చేసే అవ‌కాశం ఉంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి.

భార‌తీయ వ్యాపార‌వేత్త గౌత‌మ్ అదానీ (Gautam Adani )నేతృత్వంలోని బృందం సౌదీ అరామ్ కో, దేశ ప‌బ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ తో స‌హ‌కారం, ఉమ్మ‌డి పెట్టుబ‌డి అవకాశాల‌పై ప్రాథ‌మిక చ‌ర్చ‌లు జ‌రిపింది.

ఆరామ్ కోలో పీఐఎఫ్ వాటాలో కొంత భాగాన్ని కొనుగోలు చేసేందుకు ఓకే చెప్పిన‌ట్లు టాక్. ఇదిలా ఉండ‌గా అదానీ ఆరామ్ కో స్టాక్ కు బిలియ‌న్ల డాల‌ర్ల న‌గ‌దు వెచ్చించే అవ‌కాశం లేక పోయిన‌ప్ప‌టికీ క‌నీసం స్వ‌ల్ప కాలంలోనైనా వాటా తీసుకోవాల‌ని నిర్ణ‌యించింది.

విస్తృత టై అప్ పెట్టు కోవ‌డం లేదా అసెట్ స్వాప్ డీల్ కు అనుసంధానం చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

పున‌రుత్పాద‌క శ‌క్తి , పంట పోష‌కాలు లేదా ర‌సాయ‌నాలు వంటి రంగాల‌లో బార‌తీయ సంస్థ ఆరామ్ కో లేదా సబ్సిక్ వంటి అనుబంధ సంస్థ‌ల‌తో జ‌త క‌ట్టనుంది అదానీ గ్రూప్.

చ‌ర్చ‌లు ప్రారంభ ద‌శ‌లో ఉన్నాయ‌ని స‌మాచారం. ఇదిలా ఉండ‌గా ప్ర‌పంచంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న సంస్థ‌ల్లో ఆరామ్ కో కంపెనీ ఒక‌టి.

Also Read : వోక్స్‌వ్యాగన్ ‘టైగన్’ కార్ ఆఫ్ ది ఇయ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!