Gautam Adani Loss : అదానీ గ్రూప్ కు దెబ్బ మీద దెబ్బ

ఎఫ్పీఓ డ‌బ్బులు తిరిగి ఇచ్చేస్తాం

Gautam Adani Loss : అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బ‌ర్గ్ కొట్టిన దెబ్బ‌కు గౌతం అదానీ కంపెనీ అదానీ గ్రూప్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. రోజు రోజుకు స్టాక్ మార్కెట్ లో షేర్లు ప‌డి పోతున్నాయి. ప్ర‌పంచ ధ‌న‌వంతుల జాబితాలో మూడో స్థానంలో ఇప్ప‌టి వ‌ర‌కు కొన‌సాగుతూ వ‌చ్చిన గౌత‌మ్ అదానీ ఉన్న‌ట్టుండి 11వ స్థానానికి ప‌డి పోయాడు(Gautam Adani Loss). రాబోయే రోజుల్లో ఇంకెంత న‌ష్టం వాటిల్లుతుందోన‌న్న ఆందోళ‌న నెల‌కొంది.

ఇప్ప‌టికే ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భారీ ఎత్తున అదానీ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేశాయి. దీంతో దీనికి ఎవ‌రు జ‌వాబుదారీగా ఉంటార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఫిబ్ర‌వ‌రి 1న పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. కేంద్రం బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టింది. ప్ర‌తిప‌క్షాలు పెద్ద ఎత్తున అదానీ గ్రూప్ ను టార్గెట్ చేశాయి.

ఎందుకంటే దేశంలో భారీ ఎత్తున మోదీ ప్ర‌భుత్వం అదానీకి మేలు చేకూర్చేలా నిర్ణ‌యాలు తీసుకుంది. ప్ర‌స్తుతం హిండెన్ బ‌ర్గ్ విడుద‌ల చేసిన నివేదిక క‌ల‌క‌లం రేపింది. మార్కెట్ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. అదానీ గ్రూప్ స‌మ‌ర్పించిన లెక్క‌ల‌న్నీ త‌ప్పుడు త‌డ‌క‌లేనంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టింది. ఏకంగా రూ. 65 బిలియ‌న్ల‌ను న‌ష్ట పోయింది(Gautam Adani Loss).

దీంతో దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది అదానీ గ్రూప్. ఇక అదానీ ఎంట‌ర్ ప్రైజెస్ లిమిటెడ్ షేరు ధ‌ర రోజు రోజుకు క్షీణిస్తోంది. దీంతో ఫాలో ఆన్ ప‌బ్లిక్ ఆఫ‌రింగ్ (పీఎఫ్ఓ) డ‌బ్బులు ఇన్వెష్ట‌ర్ల‌కు తిరిగి ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు గౌతం అదానీ. ఇన్వెస్ట‌ర్ల ప్ర‌యోజ‌నాలే త‌మ‌కు ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు అదానీ.

Also Read : ఆదాయంలో అంబానీ ముందంజ

Leave A Reply

Your Email Id will not be published!