Gautam Adani Loss : 7వ స్థానానికి పడి పోయిన అదానీ
కుబేరుల జాబితాలో పడి పోయిన స్థానం
Gautam Adani Loss : అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ కొట్టిన దెబ్బకు ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ లో ఉన్న ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఉన్నట్టుండి దిగజారారు(Gautam Adani Loss) . అదానీ గ్రూప్ సమర్పించిన లెక్కల్లో అన్నీ అవకతవకలే ఉన్నాయని పేర్కొంది హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీంతో దెబ్బకు ఇప్పటి వరకు లక్షల కోట్లు ఆవిరై పోయాయి.
ఇదంతా కావాలని సదరు సంస్థ తమను డ్యామేజ్ చేసేందుకు ఇలా చేసిందని ఆరోపించింది అదానీ గ్రూప్. షేర్లు పడి పోవడంతో అదానీ ధనవంతుల జాబితాలో కిందకు జారారు. ఏకంగా 7వ స్థానానికి పడి పోయాడు. కాగా తాను సంఖ్యలను నమ్మనని , తమ వ్యాపారం మీద తమకు అపారమైన నమ్మకం ఉందని స్పష్టం చేశాడు అదానీ.
తాజాగా ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక విడుదల చేసింది. ఇందులో అదానీకి కోలుకోలేని షాక్ తగిలిందంటూ పేర్కొంది. వ్యక్తిగత సంపద దాదాపు 22.5 బిలియన్ డాలర్లకు పైగా నష్ట పోయింది. 96.8 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడింది. ఇక వరల్డ్ లో అగ్రశ్రేణి కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ తర్వాతి స్థానానికి గౌతం అదానీ పడి పోయారు(Gautam Adani Loss) .
మైక్రో సాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ వ్యక్తిగత సంపద 104.1 బిలియన్ డాలర్లుగా ఉంది. కేవలం రెండు రోజుల్లోనే మార్కెట్ క్యాప్ రూ. 2.37 లక్షల కోట్లు నష్ట పోయింది అదానీ గ్రూప్ కంపెనీ. దీని కారణంగా గౌతం అదానీ నికర నిలువ కిందకు దిగజారింది.
Also Read : హిండెన్‌బర్గ్ దెబ్బ అదానీ అబ్బా