Gautam Adani : నాలుగో స్థానానికి ప‌డి పోయిన అదానీ

హిండెన్ బ‌ర్గ్ కొట్టిన దెబ్బ‌కు షేర్లు ఢ‌మాల్

Gautam Adani : ప్ర‌ముఖ వ్యాపార దిగ్గ‌జం అదానీ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ గౌతం అదానీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. ప్ర‌పంచ కుబేరుల్లో టాప్ లో నిలిచాడు. గ‌త కొంత కాలంగా ఏకంగా నెంబ‌ర్ 1 స్థానంలో ఉన్న గౌతం అదానీకి(Gautam Adani) ఉన్న‌ట్టుండి అమెరికాకు చెందిన నాథ‌న్ ఆండ‌ర్స‌న్ సార‌థ్యంలోని రీసెర్చ్ సంస్థ హిండెన్ బ‌ర్గ్ విడుద‌ల చేసిన నివేదిక షేర్లు పూర్తిగా ప‌డి పోయేలా చేశాయి.

అదానీ గ్రూప్ లెక్క‌ల్లో వాస్త‌వాలు లేవ‌ని అన్నీ త‌ప్పులేనంటూ పేర్కొంది. దీనిపై లీగ‌ల్ గా తేల్చుకుంటామ‌ని ప్ర‌క‌టించింది అదానీ గ్రూప్. ఇదిలా ఉండ‌గా హిండెన్ బ‌ర్గ్ తాజాగా విడుద‌ల చేసిన నివేద‌క‌లో లెక్క‌ల‌న్నీ అవాస్త‌వాలేన‌ని పేర్కొన‌డంతో ఒక్క‌సారిగా స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ కంపెనీకి సంబంధించిన షేర్ల‌న్నీ ప‌డి పోయాయి.

ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ. 85, 000 వేల కోట్ల‌కు పైగా ఆదాయంలో కోత ఏర్ప‌డింది. దీంతో ప్ర‌పంచ కుబేరుల జాబితాలో 2వ స్థానంలో ఉన్న గౌతం అదానీ(Gautam Adani) ఉన్న‌ట్టుండి హిండెన్ బ‌ర్గ్ రీసెర్చ్ సంస్థ కొట్టిన దెబ్బ‌కు 4వ స్థానానికి ప‌డి పోయారు. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ సంస్థ బ్లూబ్ బ‌ర్గ్ తాజాగా వెల్ల‌డించింది.

ఇది గౌతం అదానీకి ఊహించ‌ని దెబ్బ‌. ఇన్ని వేల కోట్లు న‌ష్టం వాటిల్ల‌డం త‌న కంపెనీ కెరీర్ లో ఇదే మొద‌ట‌సారి కావ‌డం గ‌మ‌నార్హం. కావాల‌ని అమెరికా రీసెర్చ్ సంస్థ సంస్థ ఇమేజ్ ను దెబ్బ కొట్టేందుకే ఇలా చేసిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది అదానీ గ్రూప్ సంస్థ‌. కంపెనీకి సంబంధించిన లీగ‌ల్ హెడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దీనిపై అమెరికా కోర్టులో దావా వేస్తామ‌న్నారు.

Also Read : హిండెన్‌బర్గ్ దెబ్బ అదానీ అబ్బా

Leave A Reply

Your Email Id will not be published!