Gautam Adani : భారతీయ వ్యాపార దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల మధ్య పోరు నువ్వా నేనా అన్న రీతిలో సాగుతోంది. ఒకరిని మించి మరొకరు వివిధ రంగాలలో తమదైన ముద్ర కనబరుస్తున్నారు.
షేర్ల వాల్యూ మరింత పెరుగతోంది. తాజాగా అదానీ గ్రూప్ చైర్మన్ అయిన గౌతమ్ అదానీ (Gautam Adani)మరో ఘనత సాధించారు. తాజాగా ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో మనోడికి చోటు దక్కడం విశేషం.
ఇదిలా ఉండగా మొట్ట మొదటి సారిగా ఏకంగా వంద బిలియన్ల డాలర్ల లిస్టులో మనోడు చేరాడు. బ్లూంబర్గ్ ప్రతి సారి ప్రపంచ ధనవంతుల జాబితా ప్రకటిస్తుంది.
ఈసారి తాజాగా ప్రకటించిన కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ (Gautam Adani)వంద బిలియన్ల డాలర్ల మార్క్ ను దాటి చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉండగా రిలయన్స్ వర్సెస్ అదానీ గ్రూపుల మధ్య నువ్వా నేనా అన్న పోరు నడుస్తోంది.
ఆసియా ఖండంలో అత్యంత బిలియనీర్ గా చరిత్ర సృష్టించారు మరోసారి. అయితే గత రెండు సంవత్సరాల నుంచి అదానీ ఆస్తుల విలువ అంతకంతకూ పెరుగుతూ పోతోంది.
ఇటీవల రిలయన్స్ వదిలేసిన సౌదీ అరేబియాలోనే టాప్ ఆయిల్ కంపెనీగా పేరొందిన ఆరామ్ కోతో అదానీ గ్రూపు జత కట్టింది. దీంతో సదరు కంపెనీ షేర్లు మరోసారి పెరిగాయి.
ఆయన సంపద మరింత పెరుగుతూ వచ్చింది. ఇటీవల అదానీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిశారు. తమకు పనులు అప్పగించాలని కోరారు.
అదానీ సంస్థకు చెందిన కుకింగ్ ఆయిల్ విల్మర్ షేర్లు అమాంతం పెరగడంతో ఆయన టాప్ లోకి వచ్చేలా చేసింది.
Also Read : ఓఎన్జీసీ అమ్మకానికి వేళాయె