Gautam Adani : ప్రపంచ కుబేరుల్లో అదానీకి మూడో స్థానం
ముఖేష్ అంబానీని నెట్టేసిన ధనవంతుడు
Gautam Adani : భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఏకంగా అదానీ మూడో స్థానానికి చేరుకున్నాడు.
$137.4 బిలియన్ల సంపదతో గౌతమ్ అదానీ ఫ్రాన్స్ కు చెందిన బెర్నార్డ్ అర్నాల్డ్ ను అధిగమించాడు. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే టాప్ ధనవంతులలో మొదటి స్థానంలో టెస్లా సిఇఓ ఎలోన్ మస్క్ నిలిచాడు.
ఇక రెండో ప్లేస్ లో అమెజాన్ సిఇఓ జెఫ్ బెజోస్ ఉండగా అదానీ(Gautam Adani) తర్వాతి స్థానంలోకి చేరడం విశేషం. గౌతమ్ అదానీ 2022లోనే తన సంపదకు 60.9 బిలియన్ డాలర్లను జోడించాడు.
దేశంలో పేరొందిన టాప్ వ్యాపారవేత్త. ఒకప్పుడు కాలేజీ డ్రాపవుట్. బొగ్గు వైపు వెళ్లే కంటే ముందు వజ్రాల వ్యాపారిగా తన లక్ ను పరీంచుకున్నారు. గత కొన్నేళ్లుగా గౌతం అదానీ తన సంపదను , ఆదాయాన్ని, ఆస్తులను పెంచుకుంటూ పోతున్నారు.
బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇవాళ తన ప్రపంచ కుబేరుల జాబితాను ప్రకటించింది. అత్యంత మూడో ధనవంతుల లిస్టులో చోటు దక్కించు కోవడం విశేషం.
ముఖేష్ అంబానీ, చైనాకు చెందిన జాక్ మా ను వెనక్కి నెట్టి వేయడం విస్తు పోయేలా చేసింది. 60 ఏళ్ల వయస్సు కలిగిన గౌతం అదానీ కొన్నేళ్లుగా వ్యాపార రంగాలలోకి విస్తరించారు.
డేటా సెంటర్ల నుండి సిమెంట్,, మీడియా, అల్యూమినియం, పోర్ట్ ల దాకా ప్రతి దానిలో ప్రవేశించారు. పోర్ట్ , విమానాశ్రయం ఆపరేటర్ , సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ , బొగ్గు పరిశ్రమలను కలిగి ఉన్నారు.
Also Read : దీపావళి నాటికి జియో 5జీ ధమాకా – అంబానీ