Gautam Adani : బిల్ గేట్స్ ను అధిగమించిన అదానీ
వరల్డ్ లో 4వ బిగ్ బిలియనీర్ గా చోటు
Gautam Adani : భారతీయ వ్యాపారవేత్త అదానీ గ్రూప్ అరుదైన రికార్డు సృష్టించారు. ప్రపంచ కుబేరులలో బిల్ గేట్స్ ను అధిగమించి నాలుగో స్థానంలో నిలిచాడు గౌతమ్ అదానీ. అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడు.
90 బిలియన్ డాలర్లతో వరల్డ్ బిలియనర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అదానీ గ్రూపు చైర్మన్ చిన్న వస్తువుల వ్యాపారాన్ని సమ్మేళనంగా మార్చడంలో ప్రసిద్ది చెందారు.
భారతీయ వ్యాపారవేత్త అదానీ మైక్రో సాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ను వెనక్కి నెట్టడం విస్తు పోయేలా చేసింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ఈ విషయాన్ని వెల్లడించింది.
60 ఏళ్ల వయస్సు కలిగిన వ్యాపారవేత్త గౌతమ్ అదానీ(Gautam Adani) నికర విలువ గురువారం నాటికి $115.5 బిలియన్లకు చేరుకుంది. దీని సంపద $104.6 బిలియన్ల వద్ద బిల్ గేట్స్ ను అధిగమించింది.
90 బిలియన్ డాలర్లతో ఇదే భారత దేశానికి చెందిన మరో వ్యాపార దిగ్గజం రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ లిస్టులో 10వ స్థానంలో నిలిచాడు.
ఇక టెస్లా , స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలోన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన తర్వాత భారీ వివాదంలో చిక్కుకున్నారు.
$235.8 బిలియన్లతో జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఇక అదానీ గ్రూప్ చైర్మన్ చిన్న వస్తువుల వ్యాపారాన్ని ఓడ రేవులు, గనులు, గ్రీన్ ఎనర్జీతో కూడిన సమ్మేళనంగా మార్చడంలో ప్రసిద్ది చెందారు.
ఇతర దేశాలలో కూడా అదానీ గ్రూప్ విస్తరించేలా చేయడంలో కీలక పాత్ర పోషించాడు గౌతమ్ అదానీ. ఇదే సమయంలో రిలయన్స్ చీఫ్ ను అధిగమించడం విశేషం.
Also Read : మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365లో అంతరాయం