Amit Shah Gehlot : అవినీతిలో గెహ్లాట్ స‌ర్కార్ నెంబ‌ర్ వ‌న్

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా

Amit Shah Gehlot : రాజ‌స్థాన్ లో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. దేశంలోనే సీఎం గెహ్లాట్ స‌ర్కార్ నెంబ‌ర్ వ‌న్ లో ఉంద‌ని ఆరోపించారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని మండిప‌డ్డారు.

ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని చెప్పారు. కాంగ్రెస్ పాల‌న‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఈసారి ఎన్నిక‌ల్లో తాము ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు అమిత్ షా.

అవినీతి, అక్ర‌మాల‌కు రాజ‌స్థాన్ కాంగ్రెస్ స‌ర్కార్ కేరాఫ్ గా మారింద‌ని ధ్వ‌జ‌మెత్తారు కేంద్ర హోం శాఖ మంత్రి. గ‌తంలో లేనంత‌గా గెహ్లాట్ ప్ర‌భుత్వం అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డింద‌ని ఆరోపించారు. తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన అన్ని ప‌నుల‌పై విచార‌ణ చేప‌డ‌తామ‌ని ప్ర‌క‌టించారు.

రాజ‌స్థాన్ లో మోదీ ప్ర‌భుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్బంగా విజ‌యోత్స‌వ ర్యాలీని బీజేపీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టారు. ఇదిలా ఉండ‌గా ఈ ఏడాది చివ‌ర‌లో జ‌రిగే శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో , వ‌చ్చే ఏడాది 2024లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపొంద‌డం ఖాయ‌మ‌న్నారు అమిత్ చంద్ర షా(Amit Shah).

రాజ‌స్థాన్ లో 43 ల‌క్ష‌ల కుటుంబాల‌కు మంచి నీరు అందేలా ప్ర‌ధాని మోదీ హామీ ఇచ్చార‌ని చెప్పారు. ఇదే స‌మ‌యంలో జేపీ న‌డ్డా సైతం మాజీ సీఎం క‌మ‌ల్ నాథ్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కేంద్రం అమ‌లు చేసిన లాడ్లీ ల‌క్ష్మీ యోజ‌న‌ను ఆపారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read : Lucknow Court : ఆది పురుష్ నిర్మాత‌ల‌కు కోర్టు షాక్

Leave A Reply

Your Email Id will not be published!