Gender Discrimination : లింగ వివక్ష నిజం ఉపాధికి దూరం
ఆక్స్ ఫామ్ సర్వేలో సంచలన నిజం
Gender Discrimination : భారత దేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, ప్రపంచ ఆర్థిక రంగంలో ఐదో స్థానంలో నిలిచిందని గొప్పలు చెబుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాటలన్నీ ఉట్టివేనని తేలింది.
ప్రధానంగా ఉపాధి విషయంలో లింగ వివక్ష(Gender Discrimination) ప్రధానమైన సమస్యగా మారిందన్న నిజం బట్టబయలైంది. దేశంలో 98 శాతం ఉపాధి అంతరానికి లింగ వివక్షనే కారణమని తేల్చింది ప్రముఖ ఆక్స్ ఫామ్ సంస్థ.
ఇండియా డిస్క్రిమినేషన్ రిపోర్ట్ 2022 లో ఈ సంచలన విషయాలు బట్ట బయలు చేసింది. వివక్ష కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు లేబర్ మార్కెట్ లో 100 శాతం , పట్టణ ప్రాంతాల్లో 98 శాతం ఉపాధి అసమానతలు ఎదుర్కొంటున్నారని స్పష్టం చేసింది.
స్వయం ఉపాధి పొందిన పురుషులు ఆడవారి కంటే 2.5 ఎక్కువ రెట్లు సంపాదిస్తున్నారని నివేదికలో పేర్కొంది. దేశంలో స్త్రీ, పురుషుల మధ్య 98 శాతం ఉపాధి పొందక పోవడానికి లింగ వివక్షే కారణమని కుండ బద్దలు కొట్టింది.
మహిళలు పురుషులతో సమానమైన విద్యార్హత, పని అనుభవం ఉన్నప్పటికీ సామాజిక, యజమానుల పక్షపాతాల కారణంగా కార్మిక మార్కెట్ లో వివక్షకు గురవుతున్నారని వెల్లడించింది.
83 శాతం లింగ ఆధారిత వివక్షకు కారణమని , వేతన కార్మికుల ఆదాయాల మధ్య 95 శాతం అంతరం వివక్ష కారణంగా ఉందని నివేదిక పేర్కొంది.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు సంపాదిస్తున్న దానికంటే గ్రామీణ స్వయం ఉపాధి పొందిన పురుషులు రెండింతలు సంపాదిస్తున్నారు. దీనికి వివక్షే కారణమని స్పష్టం చేసింది ఆక్స్ ఫామ్.
మహిళలందరికీ సమాన వేతనాలు , పని కోసం రక్షణ , హక్కు కోసం సమర్థవంతమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ఆక్స్ ఫామ్ సూచించింది.
Also Read : ప్రైవేట్ వర్సిటీలు అవసరమా