Jos Butler : పాక్ కోసం ఇంగ్లండ్ క్రికెటర్ల ఔదార్యం
వరద బాధితుల కోసం సాయం అందజేస్తాం
Jos Butler : ప్రపంచ క్రికెట్ లో స్నేహ పూర్వకమైన వాతావరణం నెలకొనడం మంచిది. ఇప్పటికే దేశం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో భారత జట్టు శ్రీలంకలో పర్యటించింది.
కొంత మేరకు సాయ పడింది. ఇదే సమయంలో తాజాగా పాకిస్తాన్ లో పర్యటిస్తోంది ఇంగ్లండ్ క్రికెట్ జట్టు. ఇటీవల భారీ ఎత్తున వర్షాలు, వరదలు పాకిస్తాన్ ను నిట్ట నిలువునా ముంచెత్తాయి.
పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. పాకిస్తాన్ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా వరదలు ముంచెత్తాయి. 1,300 మంది ప్రాణాలు కోల్పోయారు.
4 లక్షల మందికి పైగా నిరాశ్రయులుగా మారారు. 80 వేల పశువులు కొట్టుకు పోయాయి. లక్షకు పైగా ఇండ్లను కోల్పోయారు. ఈ తరుణంలో పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉంది.
ఓ వైపు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది పాకిస్తాన్. ఈ తరుణంలో ఆ దేశంలో పర్యటించేందుకు సమ్మతి తెలిపింది ఇంగ్లండ్ క్రికెట్ జట్టు. ఏడు మ్యాచ్ ల
టి20 సీరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు నిన్న రాత్రి పాకిస్తాన్ కు చేరుకుంది.
ఈ సందర్భంగా ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్(Jos Butler) మీడియాతో మాట్లాడాడు. తాము ఆడే మ్యాచ్ ల సందర్భంగా వచ్చే మొత్తాన్ని (డబ్బులను) పాకిస్తాన్ దేశానికి ఇచ్చేలా చూస్తామన్నాడు.
ఈ విషయాన్ని ఇప్పటికే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు కూడా తెలియ చేశామని స్పష్టం చేశాడు. తాము కూడా ఒక్క పైసా తీసుకోమని చెప్పాడు.
ఈ సందర్బంగా జోస్ బట్లర్ చేసిన ప్రయత్నానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రజా, కెప్టెన్ బాబర్ ఆజంతో పాటు దేశ ప్రధానమంత్రి సైతం అభినందనలు తెలిపారు.
Also Read : సంజూ శాంసన్ ఫ్యాన్స్ వినూత్న నిరసన