Germany Ambassdor : ఖర్గేతో జర్మనీ రాయబారి భేటీ
ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
Germany Ambassdor : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో జర్మనీ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకెర్ మాన్ గురువారం భేటీ అయ్యారు. ఆయన నివాసంలో కీలక అంశాలపై చర్చించారు. ఇదిలా ఉండగా ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీతో దౌత్య సంబంధాలను ఏర్పర్చుకున్న మొదటి దేశాలలో భారత దేశం ఒకటిగా ఉంది. ఇవాళ జర్మనీ భారత దేశం అత్యంత విలువైన భాగస్వామ్యులలో ఉండడం విశేషం. ద్వైపాక్షికంగా కీలకమైన అంశాలు చర్చకు వచ్చాయి. ఉమ్మడి ప్రజాస్వామ్య సూత్రాలపై స్థాపించబడిన ,
ఉన్నత స్థాయి విశ్వాసం, పరస్పర గౌరవంతో గుర్తించబడిన రెండు దేశాల మధ్య లోతైన వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు. మల్లి కార్జున్ ఖర్గే ఈ సందర్బంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జర్మనీ రాయబారి(Germany Ambassdor) డాక్టర్ ఫిలిప్ అకెర్ మాన్ తో సుదీర్ఘకంగా చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాలు కీలకమైన భాగస్వామ్యం కలిగి ఉండడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు మల్లికార్జున్ ఖర్గే.
ప్రస్తుతం దేశంలో చోటు చేసుకున్న పరిస్థితుల గురించి కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. మరో వైపు రాహుల్ గాంధీ ఇవాళ మణిపూర్ కు బయలుదేరి వెళ్లారు. ఆయన సిమ్లాకు చేరుకున్నారు. మార్గమధ్యం ద్వారా మణిపూర్ కు చేరుకునే సమయంలో పోలీసులు ఆయన కాన్వాయ్ ను అడ్డుకున్నారు.
Also Read : Rahul Convoy Stopped : రాహుల్ గాంధీ టూర్ ఉద్రిక్తం