Bhupinder Singh : గజ‌ల్ గాయ‌కుడు భూపీంద‌ర్ సింగ్ ఇక లేరు

శోక సంద్రంలో సంగీత ప్ర‌పంచం

Bhupinder Singh : ప్ర‌ముఖ గ‌జ‌ల్ గాయ‌కుడు భూపీంద‌ర్ సింగ్(Bhupinder Singh) క‌న్ను మూశారు. ఆయ‌న వ‌య‌స్సు 82 ఏళ్లు. త‌న ఐదు ద‌శాబ్దాల సుదీర్గ‌మైన కెరీర్ లో అల‌నాటి మ‌హమ్మ‌ద్ ర‌ఫీ నుండి నేటి ల‌తా మంగేష్క‌ర్ వ‌ర‌కు సంగీత ప‌రిశ్ర‌మ‌లో ప‌ని చేశారు.

నామ్ గుమ్ జాయేగా, దిల్ ధూండ‌తా హై వంటి క్లాసిక్స్ కు పేరొందారు ఈ గ‌జ‌ల్ సింగ‌ర్. పెద్ద పేగు క్యాన్స‌ర్ తో పాటు క‌రోనా స‌మ‌స్య‌ల

కార‌ణంగా మ‌ర‌ణించిన‌ట్లు భూపీంద‌ర్ సింగ్ భార్య మితాలీ సింగ్ వెల్ల‌డించారు.

ఇక సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న ద‌శాబ్దాల సుదీర్ఘ ప్ర‌యాణంలో సింగ్ కింగ్ గా పేరొందారు. దో దివానే షెహ‌ర్ మే , ఏక్ అకేలా ఈజ్ షెహ‌ర్ మే , తోడిసి 

జ‌మీన్ తోడా ఆస్మాన్ , దునియా చూటే యార్ నా చూటే వంటి పాట‌ల‌కు మంచి గుర్తింపు పొందారు భూపీంద‌ర్ సింగ్ .

క‌రోగే యాద్ అన్న సాంగ్ కూడా సింగ్ కు పేరొచ్చింది. పంజాబ్ లోని అమృత్ స‌ర్ లో పుట్టారు. భార‌తీయ‌, బంగ్లా దేశ్ కు చెందిన భార్య‌, ఒక

కొడుకు ఉన్నాడు.

సుదీర్ఘ కాలం సంగీత ప్ర‌పంచంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉన్నాడు భూపీంద‌ర్ దా. మ‌హ్మ‌ద్ ర‌ఫీ, ఆర్డీ బ‌ర్మ‌న్ , మ‌ద‌న్ మోహ‌న్ ,

ల‌తా మంగేష్క‌ర్ , ఆశా భంస్తే , గుల్జార్ నుండి బ‌ప్పీల‌హ‌రి దాకా ప‌ని చేశాడు.

ఇక కెరీర్ విష‌యానికి వ‌స్తే భూపీంద‌ర్ సింగ్ ఢిల్లీ లోని ఆల్ ఇండియా రేడియోలో గాయ‌కుడిగా ప‌ని చేశాడు. ఇదే స‌మ‌యంలో ఒక దానిని స్వ‌ర‌క‌ర్త 

మ‌ద‌న్ మోహ‌న్ గుర్తించాడు.

వెంట‌నే ముంబైకి రావాల్సిందిగా భూపీంద‌ర్ సింగ్ కు క‌బురు పెట్టాడు. 1964లో చేత‌న్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన హ‌కీ క‌త్ తో ప్రారంభ‌మైంది. ఖ‌య్యామ్ కంపోజ్ చ‌సిన ఆఖ్రీ ఖ‌త్ లో పాడాడు.

గాయ‌ని మితాలీని 1980లో పెళ్లి చేసుకున్నాడు. భూపీంద‌ర్ సింగ్(Bhupinder Singh) ద‌మ్ మారో ద‌మ్ , చురా లియా హై, చింగారి కోయి

భ‌డ్కే , మెహ‌బూబా ఓ మెహ‌బూబా వంటి ప్ర‌సిద్ద ట్రాక్ లలో గిటారిస్ట్ గా ఉన్నారు. మ‌హారాష్ట్ర సీఎం షిండే తీవ్ర సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

Also Read : మ‌రోసారి సుప్రీంకోర్టుకు నూపుర్ శ‌ర్మ

Leave A Reply

Your Email Id will not be published!