Bhupesh Baghel : చత్తీసగఢ్ ఒలింపిక్స్ లో గిల్లీ దండ
సంప్రదాయ ఆటలకు పెద్దపీట
Bhupesh Baghel : ఛత్తీస్ గఢియా ఒలింపిక్స్ పోటీల్లో గిల్లీ దండా, లాంగ్డీ రన్ , తదితర సంప్రదాయ ఆటలను ప్రవేశ పెట్టారు. ఒలింపిక్స్ లో 14 రకాల గ్రామీణ ఆటలను టీమ్, సింగిల్ విభాగాల్లో చేర్చారు. ఈ ఒలింపిక్స్ పోటీలకు ఛత్తీస్ గఢియా ఒలింపిక్స్ అనే పేరుతో ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు.
దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో గిల్లీ దండా ఆడడం అనేది సర్వ సాధారణం. ఇవాళ ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్(Bhupesh Baghel) గురువారం ఛత్తీస్ గఢ్ ఒలింపిక్స్ ను ప్రారంభించారు. ఇదిలా ఉండగా అక్టోబర్ 6 గురువారం నుండి జనవరి 6, 2023 వరకు రాష్ట్రంలో ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.
ఒలింపిక్స్ లో 14 రకాల గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రధాన క్రీడలను చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ రాయ్ పూర్ లోని బల్వీర్ సింగ్ జునేజా ఇండోర్ స్టేడియంలో సాంప్రదాయ క్రీడల మహాకుంభమైన ఛత్తీస్ గఢియా ఒలింపిక్స్ ప్రాంరభించారు. గిల్లీ దండా, పిట్టూల్, లాంగ్డి రన్ , బంతి (కంచ) , బిల్లాస్ , పుగ్డి, గెడి రేస్ తదితర గ్రామీణ క్రీడలు ఉన్నాయి.
ఈ ఒలింపిక్స్ లో మహిళలు, పురుషులకు ప్రత్యేక కేటగిరీలతో ఆరు స్థాయిలలో ఈ వెంట్ లు నిర్వహిస్తారు. ఇందులో ఎలాంటి వయస్సు పరిమితి లేదు. ఎవరైనా పాల్గొనేందుకు వీలు కలుగుతుంది. పిల్లల నుండి పెద్దల దాకా ఎవరైనా ఆయా ఆటలలో పాల్గొనవచ్చని అన్నారు ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్ .
ప్రతి ఒక్కరిని ఇందులో భాగం పంచుకునేలా చేయడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.
Also Read : ఆస్ట్రేలియాకు బయలు దేరిన టీమిండియా