Gita Gopinath : ప్ర‌వాస భార‌తీయుల‌కు నిజ‌మైన పండుగ

ఐఎంఎఫ్ డిప్యూటీ చీఫ్ గీతా గోపీనాథ్

Gita Gopinath : బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రిగా భార‌తీయ సంత‌తికి చెందిన రిషి సునక్ నియాకంపై అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండ‌గా ప్ర‌వాస భార‌తీయురాలు, ప్ర‌ముఖ ఆర్థిక‌వేత్త‌గా పేరొందిన ఇంట‌ర్నేష‌న‌ల్ మానిట‌రింగ్ ఫండ్ (ఐఎంఎఫ్‌) – అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ గీతా గోపీనాథ్ సంతోషం వ్య‌క్తం చేశారు.

ఆమె ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పీఎంగా కొలువు తీరిన రిషి సున‌క్ కు ప్ర‌త్యేక అభినంద‌న‌లు. ప్ర‌వాస భార‌తీయుల‌కు ఇది నిజ‌మైన దీపావ‌ళి పండుగ అని కితాబు ఇచ్చారు గీతా గోపీనాథ్. ఆమె అత్యున్న‌త ప‌ద‌విలో ఉన్నారు. గీతా గోపీనాథ్ (Gita Gopinath) కూడా ప్ర‌వాస భార‌తీయురాలు కావ‌డం విశేషం.

ఇదిలా ఉండ‌గా గ‌త కొంత కాలంగా భార‌త దేశానికి చెందిన వారిలో చాలా మంది ఉన్న‌త‌మైన ప‌ద‌వుల‌లో కొలువు తీరుతున్నారు. ఇప్ప‌టికే బ్రిట‌న్ హోం శాఖ సెక్ర‌ట‌రీగా సుయెల్లా బ్రేవ‌ర్ మాన్ ఉన్నారు. ఇక ప్రపంచంలో టాప్ కంట్రీగా కొన‌సాగుతున్న అమెరికాకు ఉపాధ్య‌క్షురాలిగా ప్ర‌వాస భార‌తీయురాలు క‌మ‌లా హారీస్ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో ప్ర‌పంచ ఐటీ దిగ్గజ కంపెనీలైన గూగుల్ సిఇఓగా సుంద‌ర్ పిచాయ్ , మైక్రో సాఫ్ట్ సిఇఓగా స‌త్య నాదెళ్ల ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. కాగా క‌మ‌లా హారీస్ , సుంద‌ర్ పిచాయ్ త‌మిళ‌నాడు కు చెందిన వారు కావ‌డం విశేషం. ఇక రిషి సున‌క్ పూర్వీకులు పంజాబ్ ప్రాంతానికి చెందిన వారు.

ఆయ‌న భార్య ప్ర‌ముఖ భార‌తీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కు చెందిన చైర్మ‌న్ నారాయ‌ణ మూర్తి, సుధా మూర్తి కూతురు కావ‌డం విశేషం.

Also Read : యుద్ధానికి వ్య‌తిరేకం శాంతికి సుముఖం

Leave A Reply

Your Email Id will not be published!