Gita Gopinath : ఐఎంఎఫ్ లో దిగ్గ‌జాల స‌ర‌స‌న గీతా గోపీనాథ్

ప్ర‌ధాన ఆర్థిక‌వేత్త‌గా పేరొందిన గుర్తింపు

Gita Gopinath : ప్ర‌పంచ దేశాల‌కు చోద‌క శ‌క్తిగా భావించే అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి (ఐఎంఎఫ్‌)కి మొద‌టి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు ప్ర‌వాస భార‌తీయురాలైన గీతా గోపీనాథ్.

మొట్ట మొద‌టి భార‌త దేశానికి చెందిన మ‌హిళ కావ‌డం విశేషం. గురువారం గీతా గోపినాథ్ (Gita Gopinath) గ‌తంలో ఐఎంఎఫ్ లో ప‌ని చేసిన వారి ఫోటోల స‌ర‌స‌న త‌న ఫోటో కూడా ఉండ‌డంపై సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

ఈ మేర‌కు త‌న ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ గా మారింది. ఆర్థిక వేత్త‌గా గీతా గోపీనాథ్ పేరొందారు. ప్ర‌పంచ ఆర్థిక వేత్త‌ల‌లో ఆమె ఒక‌రుగా ఉన్నారు.

ఆమె స్వ‌స్థ‌లం ప‌శ్చిమ బెంగాల్ లోని కోల్ క‌తా. 8 డిసెంబ‌ర్ 1971లో పుట్టారు. గీతా గోపీనాథ్ వ‌య‌స్సు 50 ఏళ్లు. యూనివ‌ర్శిటీ వాషింగ్ట‌న్ లో ఎంఏ చ‌దివారు.

ప్రిన్స్ట‌న్ యూనివ‌ర్శిటీలో పీహెచ్ డి చేశారు. గ‌తంలో ఐఎంఎఫ్ ప్ర‌ధాన ఆర్థిక వేత్త‌గా ప‌ని చేశారు. ఐఎంఎఫ్ లో చేరేందుకు ముందు గీతా గోపీనాథ్ హ‌ర్వార్డ్ యూనివ‌ర్శిటీలో ఆర్థిక శాస్త్ర విభాగంలో విద్యా వేత్త‌గా 20 ఏళ్ల‌కు పైగా ప‌ని చేశారు.

2005 నుంచి 2022 దాకా కొలువు తీరారు. యూనివ‌ర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో 2001 నుంచి 2005 దాకా ప‌ని చేశారు. నేష‌న‌ల్ బ్యూరో ఆఫ్ ఎక‌నామిక్ రీసెర్చ్ లో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫైనాన్స్ , మాక్రో ఎక‌నామిక్స్ ప్రోగ్రామ్ కు కో డైరెక్ట‌ర్ గా ప‌నిచేశారు.

Also Read : అమృత ఫ‌డ్న‌వీస్ కు అరుదైన గౌర‌వం

Leave A Reply

Your Email Id will not be published!