AUS ODI Squad : ఆసిస్ వ‌న్డే టీమ్ లో గ్లెన్..మిచెల్

భార‌త్ తో జ‌రిగే వ‌న్డే సీరీస్ కు ఎంపిక

AUS ODI Squad : ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు భార‌త్ లో ఆడే మూడు మ్యాచ్ ల వ‌న్డే సీరీస్ కోసం త‌న జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఊహించ‌ని రీతిలో ఇద్ద‌రికి మ‌రోసారి ఛాన్స్(AUS ODI Squad)  ఇచ్చింది. వారిద్ద‌రూ గ‌త కొంత కాలంగా జ‌ట్టుకు దూరంగా ఉన్నారు.

ఇక ఇప్ప‌టికే నాలుగు టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో ఇప్ప‌టికే నాగ్ పూర్ , ఢిల్లీలో జ‌రిగిన రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓట‌మి పాలైంది. ఇక వ‌న్డే సీరీస్ లోనైనా స‌త్తా చాటాల‌ని మార్పులు చేసింది. ఇందుకు సంబంధించి స్టార్ హిట్ట‌ర్ గా పేరు పొందిన గ్లెన్ మాక్స్ వెల్ తో పాటు మిచెల్ మార్ష్ ల‌ను వ‌న్డే ల‌లోకి ఎంపిక చేయ‌డం అంద‌రినీ విస్తు పోయేలా చేసింది. 

ఎందుకంటే ప్ర‌స్తుతం భార‌త్ లోనే త్వ‌ర‌లో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు పూర్తిగా జ‌ట్టులో మార్పులు ఇందుకోస‌మే చేసిన‌ట్లు అర్థం అవుతోంది. ఆట‌లో భాగంగా గాయం కావ‌డంతో గ్లెన్ మాక్స్ వెల్ దూర‌మ‌య్యాడు.

మిచెల్ మార్ష్ కూడా గాయ‌ప‌డ‌డంతో ఆడ‌డం లేదు. ఇప్పుడు ఇద్ద‌రూ కోలుకోవ‌డంతో వారికే ప్ర‌యారిటీ ఇచ్చింది బోర్డు. ఇక ప్ర‌క‌టించిన జ‌ట్టు ప‌రంగా చూస్తే ఇలా ఉంది. పాట్ క‌మిన్స్ కెప్టెన్ , సీన్ అబాట్ , అగ‌ర్ , అలెక్స్ కారీ, కెమెరాన్ గ్రీన్ , ట్రావిస్ హెడ్ , జోష్ ఇంగ్లీష్ , మార్న‌స్ లాబూస్ చాగ్నే , మిచెల్ మార్ష్ , గ్లెన్ మాక్స్ వెల్ , రిచ‌ర్డ్ స‌న్ జై , స్టీవ్ స్మిత్ , మిచెల్ స్టార్క్ , మార్క‌స్ , వార్న‌ర్ , ఆడ‌మ్ జంపా ఉన్నారు.

Also Read : శాంస‌న్ ను ప‌ట్టించుకోని బీసీసీఐ

Leave A Reply

Your Email Id will not be published!