Glenn Maxwell : చుక్క‌లు చూపించిన మ్యాక్స్ వెల్

కెప్టెన్ తో క‌లిసి క‌దం తొక్కిన బ్యాట‌ర్

Glenn Maxwell : బెంగ‌ళూరులోని చిన్న స్వామి స్టేడియం బ్యాట‌ర్ల ప‌రుగుల‌తో హోరెత్తి పోయింది. 40 వేల మందికి పైగా హాజ‌రైన ఈ స్టేడియంలో నినాదాల‌తో ద‌ద్ద‌రిల్లింది. నువ్వా నేనా అన్న రీతిలో పోరు కొన‌సాగింది చెన్నై సూప‌ర్ కింగ్స్ , రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ‌ధ్య‌(CSK VS RCB).

ముందుగా బ్యాటింగ్ కు దిగిన సీఎస్కే నిర్ణీత నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 226 ర‌న్స్ చేసింది. ఓపెన‌ర్ డేవిన్ కాన్వే దంచి కొడితే శివ‌మ్ దూబే రెచ్చి పోయాడు.

అనంత‌రం 227 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ఆదిలోనే షాక్ త‌గిలింది. వ‌స్తూనే ఫోర్ కొట్టిన కోహ్లీ ఉన్న‌ట్టుండి సిక్స్ కొట్ట‌బోయి బౌల్డ్ అయ్యాడు. మ‌రో ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్ డ‌కౌట్ గా వెనుదిరిగాడు. తుషార్ దేష్ పాండే బౌలింగ్ లో.

ఈ స‌మ‌యంలో మైదానంలోకి వ‌చ్చిన కెప్టెన్ డుప్లెసిస్ చుక్క‌లు చూపించాడు. మ‌రో వైపు తానేమీ త‌క్కువ కాదంటూ గ్లెన్ మ్యాక్స్ వెల్(Glenn Maxwell) దుమ్ము రేపాడు. ఫోర్లు , సిక్స‌ర్ల‌తో హోరెత్తించాడు. మైదానం న‌లుమూలలా షాట్స్ తో అల‌రించాడు.

మ్యాక్స్ వెల్ కెప్టెన్ తో షాట్స్ కొట్టేందుకు పోటీప‌డ్డారు. ఒకానొక ద‌శ‌లో నువ్వా నేనా అన్న రీతిలో ఆడారు. గ్లెన్ కేవ‌లం 36 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 76 ర‌న్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు 8 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో క‌లుపుకుని 60 ప‌రుగులు పిండుకున్నాడు. ఒకానొక ద‌శ‌లో ఇద్ద‌రూ గ‌నుక ఇంకా మూడు ఓవ‌ర్లు ఆడి ఉంటే చెన్నై ఓడి పోయి ఉండేది.

Also Read : చిత‌క్కొట్టిన ఫాఫ్ డుప్లెసిస్

Leave A Reply

Your Email Id will not be published!