IPL AWARDS : ఐపీఎల్ అవార్డులు దక్కేదెవరికో
ఆటగాళ్లకు భారీ ప్రైజ్ మనీ
IPL AWARDS : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఆఖరి అంకానికి చేరింది. ఇక టోర్నీ ముగిసే లోపు పలు అవార్డులు ప్రకటిస్తుంది ఐపీఎల్ కమిటీ.
ఇప్పటికే వ్యక్తిగత పరుగుల జాబితాలో రాజస్తాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న జోస్ బట్లర్ 629 రన్స్ తో టాప్ లో ఉండగా ఇదే జట్టుకు చెందిన యుజ్వేంద్ర చాహల్ 26 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నాడు.
ఇక ఈసారి ఐపీఎల్ లో భారీ ఎత్తున ఫోర్లు, సిక్సర్లు నమోదయ్యాయి. ఇక ఐపీఎల్ లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ అవార్డులతో(IPL AWARDS) మరికొన్ని క్యాష్ ప్రైజ్ లు దక్కనున్నాయి.
ఆరెంజ్ క్యాప్ ప్రధానంగా టోర్నీలో అత్యధిక రన్స్ చేసి టాప్ లో నిలిచిన ఆటగాడికి ప్రకటిస్తారు. ఇక 2021లో దుబాయ్ లో జరిగిన ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ రుతురాజ్ గైక్వాడ్ అందుకున్నాడు. 635 రన్స్ చేశాడు.
పర్పుల్ క్యాప్ ను అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కు ఇస్తారు. గత సీజన్ లో హర్షల్ పటేల్ నిలిచాడు. 32 వికెట్లు తీశాడు. మోస్ట్ వాల్యూబుల్
ప్లేయర్ అవార్డు ప్రకటిస్తుంది ఐపీఎల్. 2012 దీనిని మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా ఇచ్చారు.
2013 నుంచి దీనిని మార్చేసి మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ గా ఇస్తున్నారు. గత ఐపీఎల్ లో హర్షల్ పటేల్ గెలుచుకున్నాడు. ఇక మరో అవార్డు(IPL AWARDS) ఫెయిర్ ప్లే అవార్డు ను ఉత్తమ రికార్డు కలిగిన జట్టుకు ప్రకటిస్తారు.
టోర్నీలో ఆయా జట్లకు ఇచ్చే పాయింట్ల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ప్రతి మ్యాచ్ తర్వాత ఇద్దరు ఆన్ ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్
రెండు జట్ల పనితీరు ఆధారంగా స్కోర్ ఇస్తారు.
ఇంకో అవార్డు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కింద రుతురాజ్ కు దక్కింది. ఇక ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడికి అత్యధిక
సిక్సర్ల అవార్డు ఇస్తారు.
గత ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ గెల్చకున్నాడు. అతడు టోర్నీలో 30 సిక్సర్లు కొట్టాడు. ఈసారి పలు అవార్డులు రాజస్థాన్, గుజరాత్, లక్నోను వరించే ఛాన్స్ ఉంది.
Also Read : ప్లే ఆఫ్స్ లో సత్తా చాటేదెవరు