Bhagwant Mann : గోల్డ్ బ్రార్ అరెస్ట్ టాప్ సీక్రెట్ – సీఎం

షాకింగ్ కామెంట్స్ చేసిన భ‌గ‌వంత్ మాన్

Bhagwant Mann : ప్ర‌ముఖ పంజాబ్ గాయ‌కుడు సిద్దూ మూసే వాలా హ‌త్య పంజాబ్ నే కాదు యావ‌త్ దేశాన్ని కుదిపేసింది. ఇందుకు సంబంధించి పోలీసులు పెద్ద ఎత్తున ద‌ర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక గ్యాంగ్ స్ట‌ర్ గోల్డీ బ్రార్ కు సంబంధించి టాప్ సీక్రెట్ అని పేర్కొన్నారు సీఎం. ప్ర‌ధాన సూత్ర‌ధారిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.

అమెరికా లోని కాలిఫోర్నియాలో ఈనెల ప్రారంభంలో అదుపులోకి తీసుకున్న‌ట్లు భ‌గ‌వంత్ మాన్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గోల్డీఈ బ్రార్ ను అదుపులోకి తీసుకోక పోవ‌చ్చ‌ని నివేదిక‌లు వెలువ‌డినా అది త‌ప్ప‌ని పేర్కొన్నారు సీఎం. తాము ఎఫ్బీఐతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నామ‌ని చెప్పారు.

రాష్ట్రంలోని ఉన్న‌తాధికారులు అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటున్న‌ట్లు తెలిపారు సీఎం. ఒక దేశం ఇంకో దేశానికి సంబంధించి చ‌ట్టాలు భిన్నంగా ఉంటాయ‌న్నారు. ఏది ఏమైనా ఇది బ‌య‌ట‌కు చెప్ప కూడ‌ద‌న్నారు భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann). ఇదిలా ఉండ‌గా ప్ర‌తిప‌క్షాలు కావాల‌ని త‌నను, ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయాల‌ని చూశాయ‌ని కానీ దానిని ప‌ట్టించుకోన‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

అదుపులో తీసుకున్నామ‌ని చెబుతున్నారు ఎందుకు బ‌య‌ట‌కు తీసుకు రాలేద‌న్నారు. డిసెంబ‌ర్ 2న గుజ‌రాత్ లో జ‌రిగిన ఎన్నిక‌ల ర్యాలీలో కూడా ప్ర‌క‌టించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక చాలా ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. కానీ మెల మెల్ల‌గా స‌ర్దుకున్నాయి. ఆరోప‌ణ‌లు చేయ‌డం తేలిక‌. కానీ ఇప్పుడు పాల‌న గాడిలో ప‌డింద‌న్నారు.

Also Read : సీనియ‌ర్ల ధిక్కారం రేవంత్ పై ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!