Gold Smuggling: నూడుల్స్‌ మాటున రూ. 6 కోట్ల బంగారం, వజ్రాలు స్మగ్లింగ్ !

నూడుల్స్‌ మాటున రూ. 6 కోట్ల బంగారం, వజ్రాలు స్మగ్లింగ్ !

Gold Smuggling: అగ్గిపుల్ల, సబ్బు బిల్ల… కాదేది కవితకు అనర్హం అన్నారు వెనుకటికి ఓ కవి. ఆ కవి భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న స్మగ్లర్లు… బంగారం, వజ్రాలను అక్రమంగా విదేశాలకు రవాణా చేసేందుకు కొందరు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. కోట్ల రూపాయల విలువైన డైమండ్స్‌ ను నూడుల్స్‌ ప్యాకెట్లలో దాచి అధికారుల కళ్లు గప్పి బ్యాంకాక్‌ కు తరలించే ప్రయత్నం చేశారు కొందరు ప్రయాణికులు. వారిని కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే….

నూడుల్స్‌ ప్యాకెట్లలో ఏర్పాటుచేసిన వజ్రాలను ముంబయి ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. ప్రయాణికుల నుంచి రూ. 6 కోట్లకు పైగా విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు. దీనిలో రూ.4 కోట్లకు పైగా విలువైన బంగారం, రూ.2 కోట్లకు పైగా విలువైన వజ్రాలున్నాయి. ఆ నలుగురు ప్రయాణికులను అధికారులు అరెస్టు చేశారు.

Gold Smuggling Viral

మరోవైపు… శ్రీలంక(Sri Lanka) నుంచి ముంబయికి వచ్చిన ఓ ప్రయాణికురాలి నుంచి 300 గ్రాములకు పైగా బంగారపు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించి ఆమె తన లోదుస్తుల్లో దాచి అక్రమ రవాణాకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. దుబాయ్‌, బ్యాంకాక్‌, సింగపూర్‌ ఇలా ఆయా దేశాలకు ప్రయాణించే 10 మంది భారతీయుల నుంచి దాదాపు రూ.4 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Also Read : Gaddam Prasad Kumar: తెలంగాణా స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ పై ‘ఈసీ’కి ఫిర్యాదు !

Leave A Reply

Your Email Id will not be published!