Actress Meena : మీనాకు గోల్డెన్ వీసా ఛాన్స్

వీసా అందుకున్న న‌టి

Actress Meena : గోల్డ‌న్ వీసా అన్న‌ది ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు. ప్ర‌ధానంగా సెల‌బ్రెటీస్ కు ఎక్కువ‌గా యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ – యూఏఈ ఇస్తూ వ‌స్తోంది. ప్ర‌ధానంగా సినీ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురిని ఎంపిక చేసింది.

దీని వ‌ల్ల వారికి అన్ని రంగాల‌లో ప్ర‌యారిటీ ఇస్తూ వ‌స్తోంది. గాయ‌ని చిత్ర‌, న‌టి కాజల్ కూడా గోల్డెన్ వీసా అందుకున్నారు. ఈ గోల్డెన్ వీసా 2019 నుంచి ఇస్తూ సెలెబ్రిటీలను స‌త్క‌రిస్తూ వ‌స్తోంది.

ఈ వీసాకు ఉన్న సౌల‌భ్యం ఏమిటంటే దీనిని అందుకున్న వారికి 10 సంవ‌త్స‌రాల పాటు దుబాయి పౌర‌స‌త్వం ఉంటుంది. ఆ త‌ర్వాత దానికి అదే రెన్యూవ‌ల్ అవుతుంది. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ సినీ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖ న‌టి మీనాకు(Actress Meena) ద‌క్కింది.

గోల్డెన్ వీసాను అందుకున్న స‌ద‌రు న‌టి దుబాయిలో జ‌రుగుతున్న ఎక్స్ పోలో పాల్గొంది. ఈ త‌రుణంలో త‌న‌కు ఈ అరుదైన గౌర‌వం ద‌క్క‌డం ప‌ట్ల యూఏఈ స‌ర్కార్ కు ధ‌న్య‌వాదాలు తెలిపింది.

త‌మిళ స్టార్ విజ‌య్ సేతుప‌తి, మెగాస్టార్ కోడ‌లు చెర్రీ వైఫ్ ఉపాస‌న‌కు కూడా ప్ర‌భుత్వం గోల్డెన్ వీసా అందుకున్నారు. ఇక ఈ ప్ర‌భుత్వంలో తొలిసారిగా దీనిని అందుకున్న‌ది బాద్ షా ఖాన్.

సంజ‌య్ ద‌త్, సునీల్ శెట్టి, సోనూ నిగ‌మ్, నేహా క‌క్క‌ర్ , ఫ‌రా ఖాన్ , బోనీ క‌పూర్ వీసాల‌ను పొందారు. వీరితో పాటు త్రిష‌, మోహ‌న్ లాల్, మ‌మ్ముట్టి, దుల్క‌ర్ స‌ల్మాన్ ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా దుబాయిలో ఎంచ‌క్కా విహారం చేయొచ్చ‌న్న‌మాట‌.

Also Read : ‘ఇటి’ అల‌రించ‌డం ఖాయం – ప్రియాంక‌

Leave A Reply

Your Email Id will not be published!