Netflix Loss : నెట్ ఫ్లిక్స్ కు కోలుకోలేని దెబ్బ

1 మిలియ‌న్ స‌బ్ స్కైబ‌ర్లు గుడ్ బై

Netflix Loss : వినోద రంగంలో ప్ర‌పంచ వ్యాప్తంగా టాప్ లో కొన‌సాగుతున్న అమెరిక‌న్ కంపెనీ నెట్ ఫ్లిక్స్ కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. రెండో త్రైమాసికంలో దాదాపు ఒక మిలియ‌న్ స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను కోల్పోయింది.

ఇది ఒక ర‌కంగా నెట్ ఫ్లిక్స్ కు పెద్ద దెబ్బ‌గా భావించ‌వ‌చ్చు. 9,70,000 చెల్లింపు క‌స్ట‌మ‌ర్ల న‌ష్టం ఊహించిన దాని కంటే త‌క్కువ‌గా ఉంది. దీంతో నెట్ ఫ్లిక్స్ కంపెనీ కేవ‌లం 221 మిలియ‌న్ల మంది చందాదారుల‌ను మాత్ర‌మే క‌లిగి ఉంది.

ఇదిలా ఉండ‌గా మొద‌టి త్రైమాసికంలో వ‌ర‌ల్డ్ వైడ్ గా 2,00,000 మంది క‌స్ట‌మ‌ర్ల‌ను కోల్పోయింది. స్ట్రీమింగ్ దిగ్గ‌జంగా ఇప్ప‌టికే పేరుంది నెట్ ఫ్లిక్స్ కు. స్ట్రీమింగ్ రంగంలో తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది.

ఓ వైపు అమెజాన్ , స్టార్ టీవీ త‌దిత‌ర సంస్థ‌ల‌తో నెట్ ఫ్లిక్స్ పోటీ ప‌డుతోంది. ప్ర‌ధానంగా ఎందుకు స‌బ్ స్క్రైబ‌ర్లు త‌గ్గుతున్నార‌నే దానిపై ఆలోచిస్తున్నామ‌ని సంస్థ పేర్కొంది.

రాబ‌డి పెంచుకోవడం, స‌భ్య‌త్వాల‌ను మ‌రింత వేగ‌వంతం చేయ‌డం అన్న‌దే త‌మ ముందున్న స‌మ‌స్య అని స్ప‌ష్టం చేసింది.

గ‌త ఏడాది 2021తో పోలిస్తే గ‌ణ‌నీయంగా త‌గ్గ‌డం అన్న‌ది ఇప్పుడు త‌మ‌ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య‌గా అభివ‌ర్ణించింది నెట్ ఫ్లిక్స్(Netflix Loss ). నెట్ ఫ్లిక్స్ స‌బ్ స్క్రైబ‌ర్ల న‌ష్టం ఊహించిందే.

కాగా వినియోగ‌దారుల నుడి వ‌చ్చే స‌బ్ స్క్రిప్ష‌న్ రాబ‌డిపై పూర్తిగా ఆధార‌ప‌డిన కంపెనీకి ఇది ఒక ర‌కంగా చెప్పాలంటే బాధాక‌ర‌మైన‌ద‌ని విశ్లేష‌కుడు రాస్ బెన‌స్ అంచ‌నా వేశారు.

నెట్ ఫ్లిక్స్ ను వాడే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే సంస్థ క‌ఠినంగా ఉంటుంది పాస్ వ‌ర్డ్స్ విష‌యంలో.

Also Read : భారీ వ్యయంతో రజిని , కమల్ మల్టీ స్టారర్ ..!

Leave A Reply

Your Email Id will not be published!