Roger Federer : టెన్నిస్ కు రోజర్ ఫెదరర్ గుడ్ బై
24 ఏళ్లు 24 గంటలు అనిపిస్తోంది
Roger Federer : ప్రపంచ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్(Roger Federer) ఇక ఆడలేనంటూ వెల్లడించాడు. తాను ప్రపంచ టెన్నిస్ రంగం నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు.
ఇది ఊహించని నిర్ణయం. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. 2003లో వింబుల్డన్ టైటిల్ ను గెల్చు కోవడం ద్వారా ఫెదరర్ తన మొదటి గ్రాండ్ స్లామ్ ను గెలుచుకున్నాడు.
ఆ తర్వాత 6 ఆస్ట్రేలియన్ ఓపెన్లు, 1 ఫ్రెంచ్ ఓపెన్ , 8 వింబుల్డన్ నాన్ , 5 యుఎస్ ఓపెన్ టైటిళ్లను గెలుచుకున్నాడు. మొత్తం తన టెన్నిస్ కెరీర్ లో 24 ఏళ్ల పాటు ఉన్నాడు.
మొత్తం 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్న మొదటి పురుషుల ఆటగాడు. లావర్ కప్ 2022 తర్వాత తాను ఆట నుంచి తప్పుకోనున్నట్లు స్పష్టం చేశాడు.
ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ ద్వారా వైదొలుగుతున్నట్లు తెలిపాడు ఫెదరర్. గత కొంత కాలంగా మోకాలి గాయంతో బాధ పడుతున్నాడు. వచ్చే వారం లండన్ లో జరిగే లావర్ కప్ తన చివరి ఈవెంట్ అని ప్రకటించాడు రోజర్ ఫెదరర్(Roger Federer).
41 ఏళ్ల 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల విజేత. 2021లో వింబుల్డన్ లో క్వార్టర్ ఫైనల్ లో ఓడి పోయినప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. ఇదే సమయంలో మరో క్రీడా దిగ్గజంగా పేరొందిన సెరెనా విలియమ్స్ కూడా తాను రిటైర్ అవుతున్నట్లు తాజాగా ప్రకటించింది.
మొత్తంగా ఇద్దరూ దిగ్గజ ఆటగాళ్లను ప్రపంచం కొద్ది పాటి రోజుల తేడాతో కోల్పోనుండడం బాధాకరం. ఒక రకంగా టెన్నిస్ ఫ్యాన్స్ కు ఇది కోలుకోలేని షాక్.
Also Read : రోజర్ ఫెదరర్ లివింగ్ లెజెండ్ – సెరెనా