Google Bard VS Chat GPT : చాట్ జీపీటీపై గూగుల్ ఫోకస్
ఉద్యోగులు 3 గంటలు దృష్టి పెట్టాలి
Google Bard VS Chat GPT : నిన్నటి దాకా టెక్నాలజీ రంగంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న గూగుల్ ఇప్పుడు షేక్ అవుతోంది. కేవలం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఆధారంగా తయారు చేసిన చాట్ జీపీటీ దెబ్బకు విల విల లాడుతోంది. నిన్నటి దాకా సెర్చింగ్ ఇంజిన్ లో టాప్ లో ఉంటూ వచ్చిన గూగుల్ ఉన్నట్టుండి ఇబ్బంది ఎదుర్కొంటోంది. ఇప్పట్లో చాట్ జీపీటీ గూగుల్ ను(Google Bard VS Chat GPT) చేరుకోలేక పోయినా భవిష్యత్తులో ఐటీ సెర్చింగ్ దిగ్గజానికి చెక్ పెట్టే ఛాన్స్ లేక పోలేదని ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు.
ఓ వైపు ప్రపంచంలో చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం, మరోవైపు చాట్ జీపీటీ కారణంగా గూగుల్ పై పూర్తి దెబ్బ పడుతోంది. దీంతో సంస్థకు సంబంధించిన షేర్లు పడి పోవడం విస్తు పోయేలా చేసింది.
ఇంకో వైపు మైక్రోసాఫ్ట్ కు చెందిన బింగ్ చాట్ జీపీటీ తో కలిసి ఏఐని యాడ్ చేసింది. దీని కారణంగా బింగ్ మెల మెల్లగా పుంజుకుంటోంది. చాట్ జీపీటీ కారణంగా మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని ముందే గ్రహించారు సుందర్ పిచాయ్.
ఇందులో భాగంగా ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు సంస్థకు చెందిన ఈమెయిల్స్ ద్వారా చాట్ జీపీటికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బావుంటుందో ఆలోచించాలని స్పష్టం చేశాడు సీఇఓ. గూగుల్ తొందరపడి రిలీజ్ చేసిన చాట్ బాట్ బార్డ్ అంతగా ఆకట్టుకోలేక పోయింది. దీని ఎఫెక్ట్ షేర్లపై పడింది. చాట్ జీపీటీకి ప్రత్యామ్నాయంగా విడుదల చేసిన చాట్ బార్డ్ బిగ్ డిజాస్టర్ గా మిగిలి పోవడంతో 9 శాతం సంపద కోల్పోయింది గూగుల్.
Also Read : భారత్ లో 543 మంది తొలగింపు – గూగుల్