Google Startup School : అంకురాలకు గూగుల్ ఆలంబన
భారత్ లో స్టార్టప్ స్కూల్ ఏర్పాటు
Google Startup School : ప్రపంచంలోనే అత్యధిక స్టార్టప్ (అంకురాలు)లలో ఎక్కువగా కొలువు తీరింది భారత దేశంలోనే. ప్రధానంగా ఐటీ సెక్టార్ లో ఇండియా వెలిగి పోతోంది.
ఈ తరుణంలో వరల్డ్ లో నెంబర్ వన్ టెక్ దిగ్గజంగా పేరొందింది గూగుల్ . ఎక్కడ క్రియేటివిటీ కలిగినా వాటిని గుర్తించడం, ప్రోత్సహించడం చేస్తూ వస్తోంది ఈ దిగ్గజ కంపెనీ.
ప్రతి ఏటా పర్ ఫార్మెన్స్ బేస్ మీద ఎంపిక చేసి క్యాష్ అవార్డులు కూడా ఇస్తోంది. అటు టెక్నాలజీ పరంగా ఇటు నైపుణ్యాలను తీర్చిదిద్దేలా ప్రయత్నాలు చేస్తోంది గూగుల్(Google Startup School).
ఒక్కసారి గూగుల్ లో జాబ్ దొరికితే చాలు అనే వాళ్లు ప్రపంచ వ్యాప్తంగా కోట్లల్లో ఉన్నారు. ఇది పక్కన పెడితే ఈ టెక్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది. ప్రత్యేకించి స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు గాను కీలక నిర్ణయం తీసుకుంది.
అంకురాలను ప్రారంభించి సవాళ్లను అధిగమించి ముందుకు వెళుతున్న స్టార్టప్ లను నిలదొక్కుకునేలా చేసేందుకు స్టార్టప్ స్కూల్(Google Startup School) ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గూగుల్.
దీని ద్వారా దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 10, 000 స్టార్టప్ లకు సహాయం చేయనున్నట్లు ప్రకటించింది గూగుల్. దీనిని 9 వారాల పాటు వర్చువల్ గా నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా సాంకేతిక సహకారం, యాప్ ల రూప కల్పన, కొత్త యూజర్లను ఎలా ఆకర్షించు కోవాలి, స్టార్టప్ లను ఎలా విజయవంతం చేసుకునే దిశగా ఎంపిక చేస్తుంది.
ఇదిలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం అంకురాల ఏర్పాటులో 70,000కు పైగా ఒక్క భారత్ లోనే ఉండడం విశేషం.
Also Read : సమస్తం అర చేతిలో ప్రత్యక్షం