Bhupen Hazarika : భూపేన్ హజరికాకు గూగుల్ నివాళి
ప్రత్యేక డూడుల్ తయారు చేసిన సంస్థ
Bhupen Hazarika : ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు భూపేన్ హజారికా(Bhupen Hazarika) పుట్టిన రోజు సందర్భంగా అరుదైన నివాళి అర్పించింది. ఇందులో భాగంగా ఆయనకు గుర్తుగా గూగుల్ డూడుల్ తయారు చేసింది.
సుధాకాంతగా ప్రసిద్ది చెందారు భూపేన్ దా. ఆరు దశాబ్దాల తన కెరీర్ లో వందలాది చిత్రాలకు పని చేశారు. భూపేన్ హజారికా 1926 సెప్టెంబర్ 6న అస్సాంలో పుట్టారు.
ఇవాళ దిగ్గజ గాయకుడిది 96వ జయంతి. 2011 లో మరణించారు. భూపేన్ హజారికా సంగీతంలో పేరొందారు. గాయకుడిగా, కవిగా, చిత్ర నిర్మాతగా, గీత రచయితగా పేరుగాంచారు.
1967-72లో అస్సాం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూడా పని చేశారు హజారికా. ఇదిలా ఉండగా హజారికా హార్మోనియం వాయిస్తున్న డూడుల్ ను ఇవాళ పొందు పర్చింది.
కాగా ముంబైకి చెందిన అతిథి కళాకారిణి రుతుజా మాలి దీనిని తయారు చేశారు. హజారికాకు(Bhupen Hazarika) బ్రహ్మపుత్రా నది అంటే వల్లమాలిన అభిమానం.
ఆయన ఆ నది ఒడ్డునే ఉంటూ జీవితం గురించి పాటలు, జానపద కథలు అల్లారు. పాటలు కట్టారు. రుడాలి మూవీకి హజారికా అందించిన సంగీతం దేశాన్ని ఉర్రూతలూగించింది.
ఇందులో దిల్ హూ హూ అన్న పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలిచింది. ఇదిలా ఉండగా భూపేన్ హజారికా 10 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు తన మొదటి పాటను రికార్డు చేశాడు.
1942లో ఇంటర్, 1946లో బనారస్ హిందూ యూనివర్శిటీ నుండి ఎంఏ చదివారు. న్యూయార్క్ వెళ్లి ఐదేళ్ల పాటు నివసించాడు. 1952లో కొలంబియాలో మాస్ కమ్యూనికేషన్ లో డాక్టరేట్ పొందారు.
ఆ తర్వాత గౌహతి లోని ఆల్ ఇండియా రేడియోలో పాడటం ప్రారంభించారు. బెంగాలీ పాటలను హిందీలోకి అనువదించి తన గాత్రాన్ని ఇచ్చాడు.
సినిమాల పరంగా చూస్తే రుడాలి, మిల్ గయీ మంజిల్ ముఝే, సాజ్ , దర్మియాన్ , గజగామిని, దమన్, క్యూన్ వంటి సూపర్ హిట్ చిత్రాలలో పాటు పాడారు హజారికా.
భూపేన్ దా సంగీతం, సంస్కృతికి విశిష్ట సేవలు అందించినందుకు గాను సంగీత నాటక అకాడమీ అవార్డు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. పద్మశ్రీ, పద్మ భూషణ్ తో పాటు పలు ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్నారు.
Also Read : సోషల్ మీడియాకు కేంద్రం ముకుతాడు