Kadapa Leaders: వైసీపీ నేతలకు గన్‌మెన్ల తొలగింపు !

వైసీపీ నేతలకు గన్‌మెన్ల తొలగింపు !

Kadapa Leaders: ప్రజాప్రతినిధుల భద్రత విషయంలో అధికార వైసీపీ(YCP) ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి… ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసారు. కడప జిల్లాలో అధికార పార్టీకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులకు 2+2 నుంచి 4+4 వరకు గన్‌మెన్‌లను కేటాయిస్తూ… ప్రతిపక్షాలకు చెందిన నాయకులకు మాత్రం 1+1 గన్ మెన్ లను కేటాయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని వలన ప్రజల్లోకి వెళ్ళినపుడు ఇబ్బందులు తలెత్తడంతో పాటు… భద్రత కరువవుతోందని ఈసీకు వివరించారు. రానున్న ఎన్నికల సీజన్ లో సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ గ్రామాలు, పోలింగ్ బూతుల్లో తిరిగేటప్పుడు… అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమీషన్… ప్రజా ప్రతినిధుల భద్రత విషయంలో అధికార, విపక్షాలు అనే తేడా లేకుండా భద్రత కల్పించాలని ప్రభుత్వానికి సూచించింది.

Kadapa Leaders Security Issues

ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు… విపక్ష పార్టీల నేతలకు భద్రత పెంచడం కంటే… అధికార వైసీపీ నాయకుల వద్ద ఉన్న అదనపు సిబ్బందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా కడప జిల్లాలో 20 మంది వైసీపీ నేతలకు అనధికారికంగా ఇచ్చిన గన్‌ మెన్‌ లను ప్రభుత్వం తొలగించింది. దీనితో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు అధికార, విపక్ష పార్టీల నేతల్లో ఆందోళన నెలకొంది.

Also Read : CM Revanth Reddy: ఆర్థిక ఇబ్బందులున్నా… ఆరు గ్యారంటీల అమలు చేస్తాం – సీఎం రేవంత్‌రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!