Dwakra Women: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్ !

మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్ !

Dwakra Women: డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిపివేసిన డ్వాక్రా రుణాలను తిరిగి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka)… భద్రాద్రి రామయ్య సాక్షిగా ప్రకటించారు. వడ్డీలేని రుణాలను డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం ఇస్తుందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేసారు. కాంగ్రెస్ పాలనలో మహిళలను మహాలక్ష్మిలాగా చూసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాని మరోసారి గుర్తు చేసిన ఆయన… ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది సకాలంలో జీతాలు అందేలా ఇబ్బంది లేకుండా చేస్తామని ప్రకటించారు.

Dwakra Women Got Good News

భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరుకాగా.. ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల అభివృద్ధి కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ‘‘భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం సాక్షిగా డ్వాక్రా మహిళలకు తీపి కబురు చెబుతున్నాం. ఇప్పటికే మహిళలకు పెద్దపీట వేసి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. త్వరలో డ్వాక్రా మహిళలందరికీ వడ్డీలేని రుణాలు అందిస్తాం. చాలా కాలం నుంచి నెలనెలా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆశా వర్కర్లు నా దృష్టికి తెచ్చారు. వారికి జీతాలు అందే విధంగా కృషి చేస్తా’’ అని తెలిపారు. డిప్యూటీ సీఎం ప్రకటనపై తెలంగాణా మహిళలు ముఖ్యంగా డ్రాక్రా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Buddha Venkanna: చంద్రబాబు ఫ్లెక్సీకి తన రక్తంతో అభిషేకం చేసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న !

Leave A Reply

Your Email Id will not be published!