Bhubharathi Act : తెలంగాణ సర్కార్ తీసుకొస్తున్న ‘భూభారతి’ చట్టానికి గవర్నర్ ఆమోదం
వ్యక్తిగత ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేసిందని విమర్శించారు...
Bhubharathi Act : తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టానికి ఆమోద ముద్ర పడింది. భూభారతి చట్టానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు.డిసెంబర్ 20వ తేదీన భూభారతి(Bhubharathi) బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. అనంతరం డిసెంబర్ 30వ తేదీన గవర్నర్ కార్యాలయానికి భూభారతి బిల్లు చేరింది. ఈరోజు భూభారతి చట్టానికి ఆమోదం తెలుపుతూ గవర్నరం నిర్ణయం తీసుకున్నారు. దీంతో త్వరలోనే భూభారతి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. మార్గదర్శకాలపై సర్కార్ కసరత్తు చేస్తోంది. గవర్నర్ ఆమోదించిన భూభారతి బిల్లు కాపీని గురువారం సచివాలయంలో మంత్రి శ్రీనివాస రెడ్డికి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా చట్టాన్ని అమలులోకి తెస్తామన్నారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆర్వోఆర్ – 2020 వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారన్నారు.
Bhubharathi Act Governor Approves
వ్యక్తిగత ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేసిందని విమర్శించారు. కొందరికి సేవ చేయడానికి మాత్రమే పరిమితమైన రెవెన్యూ సేవలను అందరికీ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేర్కొన్నారు. కాగా… ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని రద్దు చేసి భూభారతి పోర్టల్‌ను ఏర్పాటు చేసింది.
ఆర్వోఆర్-2020నుకూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తూ.. ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ధరణి స్థానంలో కొత్తగా భూ భారతి చట్టం అమల్లోకి రానుంది. ఇప్పటికే ఈ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గత ఏడాది డిసెంబర్ 18న భూభారతి చట్టం బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టగా.. అదే నెల 20, 21 తేదీల్లో శాసనసభ, మండలి ఆమోదం తెలిపింది. ఆపై గర్నవర్‌కు ఈ బిల్లును పంపగా.. ఈరోజు భూభారతికి ఆమోదం తెలుపుతూ గవర్నర్ సంతకం చేశారు. భూభారతితో రైతులకు ప్రయోజనం చూకూరుతుందని ఇది వరకే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు.
Also Read : Minister Ram Mohan : ప్రధాని విశాఖ పర్యటనపై కేంద్ర పౌరవిమానయాన మంత్రి కీలక వ్యాఖ్యలు