Sania Mirza Farewell : సానియా మీర్జాకు ఘనంగా వీడ్కోలు
లాల్ బహదూర్ స్టేడియంలో ఏర్పాటు
Sania Mirza Farewell : భారత దేశ టెన్నిస్ రంగంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న ఏకైక క్రీడాకారిణి సానియా మీర్జా. ఆమె అంతర్జాతీయ టెన్నిస్ క్రీడా రంగం నుంచి నిష్క్రమించింది.
అంచెలంచెలుగా ఎదుగుతూ తనను తాను విజేతగా మల్చుకుంది. కెరీర్ పరంగా టాప్ లో నిలిచింది. ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. ఆరుసార్లు గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచింది. మహిళల డబుల్స్ లో మూడు , మిక్స్ డ్ డబుల్స్ లో టైటిళ్లు సాధించింది. వేలాది మంది సానియా మీర్జాకు(Sania Mirza Farewell) వీడ్కోలు పలికారు.
ఆమెతో పాటు పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా సినీ, రాజకీయ, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వారిలో ప్రిన్స్ మహేష్ బాబు, దిగ్గజ సంగీత దర్శకుడు అల్లా రఖా రెహమాన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అశేష అభిమానుల మధ్య సానియా మీర్జా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టారు. ఆమె రోహన్ బోపన్న, యువరాజ్ సింగ్ , బెస్ట్ ఫ్రెండ్ బెథానీ మాటెక్ సాండ్స్ , ఇవాన్ డోడిగ్ , కారా బ్లాక్ , మారియన్ బార్టోలీలతో ఎగ్జిబిషన్ మ్యాచ్ లు ఆడింది.
దాదాపు రెండు దశాబ్దాల కిందట చారిత్రాత్మక డబ్ల్యూటీఏ సింగిల్స్ విజయంతో చరిత్ర సృష్టించింది. ఎర్రటి కారులో వేదిక వద్దకు చేరుకోగానే మైదానం మొత్తం హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సానియా మీర్జా(Sania Mirza) ప్రసంగించారు. దేశం తరపున 20 సంవత్సరాల పాటు ఆడటం తనకు లభించిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు.
Also Read : రెహమాన్ తో ప్రిన్స్ సెల్ఫీ