Joe Root Welcome : జో రూట్ కు గ్రాండ్ వెల్ క‌మ్

అద్భుత ఇన్నింగ్స్ కు ఫిదా

Joe Root Welcome : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. లార్డ్స్ లో న్యూజిలాండ్ తో జ‌రిగిన మొద‌టి టెస్టులో క‌ష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్ ను గ‌ట్టెక్కించ‌డ‌మే కాదు తానే ద‌గ్గ‌రుండి గెల‌పించాడు.

అజేయ సెంచ‌రీతో ఆదుకున్నాడు. ఇదే స‌మ‌యంలో 10 వేల ప‌రుగులు చేశాడు. అత్య‌ధిక ర‌న్స్ చేసిన రెండో క్రికెటర్ గా నిలిచాడు జో రూట్.

జ‌ట్టు కీవీస్ తో గెలుపొందిన అనంత‌రం మైదానం నుంచి పెవిలియ‌న్ కు వ‌స్తుండ‌గా స్టేడియంలో ఉన్న అభిమానులతో పాటు డ్రెస్సింగ్ రూమ్ లో సైతం లేచి నిల‌బ‌డి జో రూట్ కు ఘ‌న స్వాగ‌తం(Joe Root Welcome) ప‌లికారు.

ఈ సంద‌ర్భంగా జ‌ట్టుకు విజ‌యాన్ని సాధించి పెట్టిన జో రూట్ ను ఆలింగ‌నం చేసుకున్నాడు కెప్టెన్ బెన్ స్టోక్స్ . ఇత‌ర ఆట‌గాళ్ల‌తో పాటు మాజీ క్రికెట‌ర్లు సైతం అభినందించారు.

కీవీస్ తో జ‌రిగిన మూడు టెస్టుల సీరీస్ లో 1-0 తో ఆధిక్యంలో నిలిచింది. జో రూట్ త‌న టెస్టు క్రికెట్ లో న్యూజిలాండ్ తో చేసిన తాజా సెంచ‌రీతో 26వ టెస్ట్ సెంచ‌రీ. ఆట అనంత‌రం కీవీస్ ఆట‌గాళ్ల‌తో క‌ర‌చాల‌నం చేశాక పెవిలియ‌న్ కు సంతోషంగా చేరుకున్నాడు జో రూట్.

డ్రెస్సింగ్ రూమ్ పూర్తిగా సంతోషంతో నిలిచి పోయింది. మిస్ట‌ర్ డిపెండ‌బుల్. జో రూట్(Joe Root Welcome) మ‌ళ్లీ లేచి నిల‌బ‌డ్డాడు. ప‌ది వేల ర‌న్స్ చేశాడు. జ‌ట్టును గ‌ట్టెక్కించాడు.

వాట్ ఎ ప్లేయ‌ర్ వాట్ ఏ మ్యాన్ అని ఇంగ్లండ్ క్రికెట్ పేర్కొంది. మ్యాచ్ అనంత‌రం రూట్ మాట్లాడాడు. జ‌ట్టు విజ‌యం కోసం తాను శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తాన‌ని చెప్పాడు.

Also Read : 10 వేల ప‌రుగుల క్ల‌బ్ లో జో రూట్

Leave A Reply

Your Email Id will not be published!