Group 2 Exams : మరికాసేపట్లో ప్రారంభం కానున్న గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలు

ఇవాళ జరిగే తుది పరీక్ష ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు...

Group 2 Exams : ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం అధికారులు ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 175 కేంద్రాల్లో పరీక్షలను ఏపీపీఎస్సీ(APPSC) నిర్వహించనుంది. 905 పోస్టులకు గానూ 92,250 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రిలిమ్స్ పరీక్షల్లో ఒక్కో పోస్టుకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయగా.. ఇవాళ జరిగే తుది పరీక్ష ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Group 2 Exams Update

కాగా,ఆదివారం ఉదయం 10 గంటలకు అన్నీ కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభం అవుతాయి. మెుదటి పేపర్ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకూ, రెండో పేపర్ పరీక్షలు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకూ నిర్వహించనున్నారు. మరోవైపు విశాఖ జిల్లాలోనూ 11,029 మంది అభ్యర్థులు గ్రూప్-2 పరీక్షల్లో తమ భవితవ్యం తేల్చుకోనున్నారు. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం 16 కేంద్రాల్లో పూర్తి ఏర్పాట్లు చేశారు.

విశాఖలోఅభ్యర్థులు మరోసారి ఆందోళనకు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. అభ్యర్థులను మినహా కేంద్రాల వద్దకు ఎవ్వరినీ అనుతించరని సమాచారం. మరోవైపు కలెక్టరేట్‌లోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షలు రాసే అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే 0891 2590100, 0891 2590102 నంబర్లకు కాల్ చేయాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు.

గ్రూప్‌-2మెయిన్స్‌ పరీక్షలు(Group 2 Exams) వాయిదా వేయాలని, రోస్టర్‌ విధానంలో మార్పులు చేయాలంటూ అభ్యర్థులు గత మూడ్రోజులపాటు డిమాండ్ చేశారు. పరీక్షలు నిలిపివేసేందుకు నిరాకరిస్తూ సింగిల్‌ జడ్జి ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సైతం అభ్యర్థులు వ్యతిరేకించారు. ఈ మేరకు హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి ప్రాంతాల్లో వారంతా రోడ్లెక్కారు. పరీక్షలు వాయిదా వేయాలని, జీవో 77 ప్రకారం నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ సైతం ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. అయినప్పటికీ పరీక్షలు నిర్వహించేందుకే ఏపీపీఎస్సీ సిద్ధమైంది. కాగా, దీనిపై అభ్యర్థులు మరోసారి హైకోర్టు మెట్లెక్కారు.

Also Read : MLA KTR Slams : స్వయంగా ముఖ్యమంత్రే తెలంగాణ పరువును గంగలో కలిపారు

Leave A Reply

Your Email Id will not be published!