GT v MI IPL 2022 : ముంబై మెరిసేనా గుజరాత్ గెలిచేనా
పాయింట్ల పట్టికలో టైటాన్స్ టాప్
GT v MI IPL 2022 : ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ కు వేదిక కానుంది ముంబై. 15వ సెషన్స్ లో ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక విజయాలు నమోదు చేసి ప్లే ఆఫ్స్ కు చేరుకుంది గుజరాత్ టైటాన్స్ . హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఈ జట్టు అన్ని రంగాల్లో రాణిస్తూ సత్తా చాటుతోంది.
ఇక టైటిల్ ఫెవరేట్ గా ఉంటూ వచ్చిన ముంబై ఇండియన్స్ పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి పరువు పోకుండా కాపాడుకుంది. ఆ జట్టు రాజస్థాన్ పై గెలుపొందింది.
ఇవాళ గుజరాత్ వర్సెస్ ముంబై తలపడనున్నాయి(GT v MI). ఇక జట్ల పరంగా చూస్తే గుజరాత్ జోరు మీదుంది. ముంబై జోగుతోంది. టీమ్ పరంగా చూస్తే ఇలా ఉన్నాయి.
గుజరాత్ టైటాల్స్ లో మాథ్యూ వేడ్ , జోసఫ్ , జేసన్ రాయ్ , జయంత్ యాదవ్ , డొమినిక్ గ్రేక్స్ , గురు కీరత్ సింగ్ , నూర్ అహ్మద్ , ప్రదీప్ సాంగ్వాన్ , సాయి సుదర్శన్ , సదరంగని, డేవిడ్ మిల్లర్ , హార్దిక్ పాండ్యా ( కెప్టెన్ ) షమీ, రషీద్ ఖాన్ , విజయ్ శంకర్ , సాహా, దర్శన్ నాల్కేండే ఆడతారు(GT v MI).
యశ్ దయాల్ , సాయి కిషోర్ , లూకీ ఫెర్యూ సన్ , శుభ్ మన్ గిల్ , రాహుల్ తెవాతియా, వరుణ్ ఆరోన్ ఉన్నారు. ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా , రమణ్ దీప్ సింగ్ , హృతిక్ షోకీన్ , రాహుల్ బుద్ది,
అర్షద్ ఖాన్, సూర్య కుమార్ యాదవ్ ,కీరన్ పొలార్డ్ , ఇషాన్ కిషన్ , జస్ ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి ఆడతారు. వీరితో పాటు ఆర్యన్ జుయల్ , అమూల్ ప్రీత్ సింగ్ , అర్జున్ టెండూల్కర్ , జోఫ్రా ఆర్చర్ , డానియెల్ సామ్స్ , టైమల్ మిల్స్ , డెవాల్డ్ బ్రెవిస్ ,
సంజయ్ యాదవ్ , తిలక్ వర్మ, మురుగన్ అశ్విన్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనాద్కత్ , మయాంక్ మార్కెండే , టిమ్ డేవిడ్ , రిలె మెరిడిత్ ఆడతారు(GT v MI).
Also Read : మార్క్ రమ్ మెరుపులు వృధా