GT vs CSK IPL 2022 : గుజరాత్ టైటాన్స్ అలవోక విజయం
7 వికెట్ల తేడాతో సీఎస్కే పరాజయం
GT vs CSK IPL 2022 : టైటిల్ ఫెవరేట్ గా మారిన హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్(GT vs CSK IPL 2022) మరో విజయాన్ని నమోదు చేసింది. ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో సత్తా చాటింది. తనకు ఎదురే లేదని నిరూపించింది.
134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి విక్టరీ సాధించింది. వృద్ది మాన్ సాహా అద్భుతంగా ఆడాడు. చెన్నై(GT vs CSK IPL 2022) బౌలర్లకు చుక్కలు చూపించాడు. 57 బంతులు ఎదుర్కొన్న సాహా 7 ఫోర్లు ఒక సిక్సర్ తో 67 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
గుజరాత్ విజయంలో కీలక భూమిక పోషించాడు. ఇక గుజరాత్ టైటాన్స్ ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే రిచ్ లీగ్ లో 10వ విజయాన్ని నమోదు చేసింది. ప్లే ఆఫ్స్ కు దర్జాగా చేరింది.
ఇక సీఎస్కే బౌలర్లలో మతీష పతిరన 2 వికెట్లు తీయగా మొయిన్ అలీ ఒక వికెట్ తో సరిపెట్టుకున్నాడు. ఏ కోశాన గుజరాత్ బ్యాటర్లపై
ప్రభావం చూపలేక పోయారు. ఇక టాస్ గెలిచిన సీఎస్కే కెప్టెన్ ధోనీ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 రన్స్ మాత్రమే చేసింది. రుతురాజ్ గైక్వాడ్ , నారాయణ్ జగదీశన్ మాత్రమే రాణించారు.
మరోసారి ధోనీ నిరాశ పరిచాడు. అంబటి రాయుడిని పక్కన పెట్టింది సీఎస్కే టీం. రుతురాజ్ 49 బంతులు ఆడి 53 రన్స్ చేశాడు.
ఇందులో 6 ఫోర్లు ఒక సిక్స్ ఉంది. జగదీశన్ 33 బంతులు ఆడి 39 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు.
ఇక సీఎస్కే ఇంటి బాట పట్టనుంది అనూహ్యంగా. ఇక గుజరాత్ బౌలర్లు షమీ 2 వికెట్లు తీస్తే రషీద్ ఖాన్ , జోసఫ్ , సాయి కిషోర్ చెరో వికెట్ తీశారు.
Also Read : గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 134 రన్స్