GT vs LSG IPL 2022 : సమ ఉజ్జీల సమరం ఎవరిదో విజయం
లక్నో వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఫైట్
GT vs LSG IPL 2022 : ఐపీఎల్ 2022లో అరుదైన పోరాటానికి పుణె లోని ఎంసీఏ స్టేడియం వేదిక కానుంది. 15 సీజన్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది.
లక్నోకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తుండగా గుజరాత్(GT vs LSG IPL 2022) కు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తున్నాడు. ఇరు జట్లు టైటిల్ వేటలో పడ్డాయి. ఇప్పటి వరకు లక్నో సూపర్ జెయంట్్ 11 మ్యాచ్ లు ఆడి 8 మ్యాచ్ లలో విజయం సాధించింది.
మూడు మ్యాచ్ లలో ఓడి పోయింది. ఇక గుజరాత్ టైటాన్స్ 11 మ్యాచ్ లు ఆడి 8 మ్యాచ్ లలో గెలుపొందింది. మూడు మ్యాచ్ లలో పరాజయం మూటగట్టుకుంది. ఈ రెండు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి.
మిగతా రెండు జట్ల కోసం వేచి చూస్తున్నారు. ఇక జట్ల పరంగా చూస్తే ఇలా ఉన్నాయి. గుజరాత్(GT vs LSG IPL 2022) టైటాల్స్ లో మాథ్యూ వేడ్ , జోసఫ్ , జేసన్ రాయ్ , జయంత్ యాదవ్ ,
డొమినిక్ గ్రేక్స్ , గురు కీరత్ సింగ్ , నూర్ అహ్మద్ , ప్రదీప్ సాంగ్వాన్ , సాయి సుదర్శన్ , సదరంగని, డేవిడ్ మిల్లర్ , హార్దిక్ పాండ్యా ( కెప్టెన్ ) షమీ, రషీద్ ఖాన్ , విజయ్ శంకర్ , సాహా, దర్శన్ నాల్కేండే ఆడతారు.
యశ్ దయాల్ , సాయి కిషోర్ , లూకీ ఫెర్యూ సన్ , శుభ్ మన్ గిల్ , రాహుల్ తెవాతియా, వరుణ్ ఆరోన్ ఉన్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో కేఎల్ రాహుల్ ( కెప్టెన్ ), అయుష్ బదోని, కర్ణ్ శర్మ, కైల్ మేయర్స్ ,
అంకిత్ రాజ్ పుత్, ఆండ్రూ టై, మయాంక్ యాదవ్ , క్వింటన్ డీకాక్ , ఎవిన్ లూయిస్ , జేసన్ హోల్డర్ ఆడతారు. మనీష్ పాండే, షాబాజ్ నదీమ్ , కృనాల్ పాండ్యా, మోహిసిన్ ఖాన్ , రవి బిష్నోయ్ , అవేశ్ ఖాన్ , మార్కస్ స్టోయినిస్ , మననో వోహ్రా, దుష్మంత్ చమీరా, దీపక్ హూడా, కృష్ణప్ప గౌతమ్ ఆడనున్నారు.
Also Read : తిప్పేసిన జస్ప్రీత్ బుమ్రా