GT vs PBKS IPL 2023 : పంజాబ్ పై పాండ్యా సేన విక్ట‌రీ

6 వికెట్ల తేడాతో అద్భుత విజ‌యం

GT vs PBKS IPL 2023 : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో భాగంగా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్. టాస్ గెలిచిన గుజ‌రాత్(GT vs PBKS IPL 2023) ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. మ్యాచ్ లో భాగంగా బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ గుజ‌రాత్ బౌల‌ర్ల ధాటికి భారీగా ప‌రుగులు చేయ‌లేక చ‌తికిల ప‌డింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి కేవ‌లం 153 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

గుజరాత్ టైటాన్స్ ముందు 154 ర‌న్స్ టార్గెట్ ముందుంచింది. ఈ ల‌క్ష్యాన్ని చాలా జాగ్ర‌త్త‌గా ఛేజ్ చేసింది. ఎప్ప‌టి లాగే గుజ‌రాత్ కు అంది వ‌చ్చిన అవ‌కాశంగా మారాడు ఓపెన‌ర్ శుభ్ మ‌న్ గిల్. వ‌రుస‌గా రాణిస్తుండ‌డం విశేసం. మ‌రోసారి మెరిశాడు. 49 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 1 సిక్స్ తో 67 ర‌న్స్ చేశాడు.

అత‌డికి అండ‌గా వృద్ది మాన్ సాహా తోడ‌య్యాడు. 19 బంతులు ఎదుర్కొని 5 ఫోర్ల‌తో 30 ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇక సాయి సుంద‌ర్శ‌న్ 19 ర‌న్స్ చేస్తే , మిల్ల‌ర్ 17 , తెవాతియా 5, పాండ్యా 8 ర‌న్స్ చేశారు.

ఇక పంజాబ్ జ‌ట్టులో మాథ్యూ షార్ట్ 36 ర‌న్స్ తో మెరిస్తే జితేశ్ శ‌ర్మ 25 , సామ్ క‌ర‌న్ 22 , షారుఖ్ ఖాన్ 22 , భానుక రాజ‌ప‌క్స 20 ప‌రుగులు చేశారు. శ‌ర్మ 2, ష‌మీ , లిటిల్ , జోసెఫ్‌, ర‌షీద్ ఖాన్ చెరో వికెట్ తీశారు.

Also Read : మెరిసిన శుభ్ మ‌న్ గిల్

Leave A Reply

Your Email Id will not be published!