GT vs RR IPL 2022 FInal : యుద్ధానికి సిద్ధం సమరానికి సన్నద్ధం
గుజరాత్ టైటాన్స్ రాజస్తాన్ రాయల్స్ ఫైట్
GT vs RR IPL 2022 FInal : గత రెండు నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా అలరిస్తూ వస్తున్న ఇండియన్ ప్రిమీయర్ లీగ్ -2022 ఇవాల్టితో ముగింపు పలకనుంది.
మెగా రిచ్ లీగ్ లో తొలి జట్టుగా ఎంట్రీ ఇస్తూనే ఐపీఎల్ ఫైనల్ కు చేరింది హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా 2008లో టైటిల్ గెలిచి 14 ఏళ్ల విరామం తర్వాత నిలకడగా రాణిస్తూ ఫైనల్ కు చేరిన సంజూ శాంసన్ నేతృత్వంలోని
రాజస్థాన్ రాయల్స్(GT vs RR IPL 2022 FInal ) తలపడనుంది.
ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యధిక కెపాసిటీ కలిగిన స్టేడియంగా పేరొందిన గుజరాత్ లోని అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో ఫైనల్ జరగనుంది.
ఇప్పటికే క్వాలిఫయిర్ -2 మ్యాచ్ లో ఏకంగా లక్ష మందికి పైగా హాజరైనట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయంటే ఐపీఎల్ కు ఉన్న క్రేజ్
ఏంటో అర్థం అవుతుంది.
ఇరు జట్లు సమరానికి సన్నద్ధం అయ్యాయి. క్వాలిఫయిర్ -1లో రాజస్థాన్ రాయల్స్ ను 7 వికెట్ల తేడాతో మట్టి కరిపించి నేరుగా ఫైనల్ కు
చేరింది గుజరాత్ టైటాన్స్.
రెండో ఛాన్స్ ను మిస్ కాకుండా సత్తా చాటింది రాజస్తాన్. ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నోకు చుక్కలు చూపించి 14 పరుగులతో గ్రాండ్ విక్టరీ సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 7 వికెట్ల తేడాతో ఓడించి ఔరా అనిపించేలా చేసింది.
ఇరు జట్లు తమ శక్తియుక్తుల్ని చాటేందుకు సన్నద్ధం అయ్యారు. ఇక ఆదివారం యావత్ ప్రపంచం అంతా
ఎదురు చూస్తోంది ఉత్కంఠతతో. ఎవరు ఐపీఎల్ 15వ సీజన్ టైటిల్ విజేత అవుతారని.
ఐపీఎల్ ఫైనల్ కంటే ముందు వినోద భరిత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది బీసీసీఐ. దిగ్గజ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్
అల్లా రఖా రెహమాన్ సంగీతంలో బాలీవుడ్ నటీనటుల తళుకులు మెరవనున్నాయి.
Also Read : ఆ ఇద్దరి బౌలింగ్ అద్భుతం – సచిన్