Gudivada Amarnath : లడ్డు రాజకేయం వల్లనే తిరుపతి సంఘటన జరిగింది
మృతుల కుటుంబాలకు వైసీపీ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని గుడివాడ అమర్నాథ్ అన్నారు...
Gudivada Amarnath : తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతిచెందడంపై మాజీ మంత్రి, వైసీపీ అగ్రనేత గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఇవాళ(గురువారం) విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై అమర్నాథ్(Gudivada Amarnath) తీవ్ర విమర్శలు చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటన బాధకరమని అన్నారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం.. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి.. ఎక్స్‌గ్రేషియో కోటి రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లడ్డూని రాజకీయం చేశారు.. అందుకే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని భక్తులు భావిస్తున్నారని అన్నారు. ఇందుకు కారణమైన వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Gudivada Amarnath Comment
మృతుల కుటుంబాలకు వైసీపీ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని గుడివాడ అమర్నాథ్ అన్నారు. మోదీ భజన మానేసి తిరుపతిలో భక్తుల, సౌకర్యాల మీద దృష్టి పెడితే ప్రాణాలు పోయేవి కాదని అన్నారు. గతంలో పవన్ కల్యాణ్ సనాతన దీక్ష, హిందూ ధర్మ దీక్ష చేశారు ఇప్పుడు ఏ దీక్ష చేస్తారో చూస్తామని అన్నారు. ఈ పాప పరిహారం ఎలా సరిదిద్దుకుంటారో, సనాతన ధర్మాన్ని కాపాడే నాయకుడు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో స్పష్టమైన ప్రకటన ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించారు. నిన్న మోదీ ఏపీకి ఎలాంటి హామీలు ఇవ్వలేదన్నారు. ఏపీ అభివృద్ధిపై మోదీ కట్టుబడి ఉన్నారా అని నిలదీశారు.గ్రీన్ హైడ్రోజన్, బల్క్ డ్రగ్ పార్క్ ఈ ప్రాజెక్టులు అన్ని మెజార్టీ గతంలోనివేనని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నానికి కొత్తగా ఏం తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. నిన్న సమావేశంలో ప్రధాని మోదీ భజన తప్పితే, ఏం కనిపించలేదని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ గురించి కనీసం ఒక మాట.. ఎందుకు మాట్లాడలేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిలదీశారు.
Also Read : YS Jagan : తిరుపతి తొక్కిసలాట బాధితుల పరామర్శకు మాజీ సీఎం