Gujarat vs Mumbai Indians : బీసీసీఐ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఉమెన్స్ ప్రీమీయర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)(WPL 2023) ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా తొలి లీగ్ మ్యాచ్ లో బెత్ మూనీ సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్ , హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. టోర్నీలో మొత్తం 5 జట్లు పాల్గొంటున్నాయి.
23 రోజుల పాటు ఇది కొనసాగుతుంది. భారీ ఎత్తున ప్రైజ్ మనీ కూడా దక్కనుంది విజేత జట్టుకు. ప్రపంచ మహిళా క్రికెట్ లో టాప్ లొ కొనసాగుతున్న బెత్ మూనీ హాట్ టాపిక్ గా మారారు.
గుజరాత్ కు ఆమె బలం కానుంది. ఇక హర్మన్ ప్రీత్ కౌర్ కూడా చాలా కూల్ గా ఉంటూనే అద్భుతంగా ఆడగల సామర్థ్యం ఉంది. గుజరాత్ టీమ్ లో హర్లీన్ డియోల్ , స్నేహ రాణా, సుష్మా వర్మ కీలక ప్లేయర్లు. వీరితో పాటు ఆష్లే గార్డనర్ , జార్జియా వేర్ హామ్ , సోఫీ డంక్లీ విదేశీ ఆటగాళ్లు.
ముంబై ఇండియన్స్ పరంగా చూస్తే నథాలీ సీవర్ బ్రంట్ , అమేలీ కేర్ , ఇసీ వాంగ్ , క్లో ట్రయాన్ స్టార్ ప్లేయర్లు కీలకం కానున్నారు. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ షవర్ బ్రంట్ ఏ ఫార్మాట్ లోనైనా బౌలర్లను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉంది.
ఇరు జట్లు నువ్వా నేనా అన్న రీతిలో తలపడేందుకు సిద్దమయ్యాయి. జట్ల పరంగా చూస్తే ముంబై గుజరాత్ టైటాన్స్(Gujarat vs Mumbai Indians) లో బెత్ మూనీ కెప్టెన్ , మేఘన, డియోల్ , యాష్ , హేమలత, డియాండ్రా, సుథర్ ల్యాండ్ , స్నేహ్ రాణా , హర్లీ గాలా లేదా అశ్విని ,మానసి లేదా మోనికా పటేల్ , తనూజా కన్వర్ ఆడతారు.
ఇక ముంబై ఇండియన్స్ లో హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ కాగా యస్తికా భాటియా, ధారా , హేలీ , బ్రంట్ , అమమోలియా, అమన్ జ్యోత్ , పూజా , జింతిమని కలితా, ఇస్సీ వాంగ్ , సోనమ్ లేదా ఇషాకీ ఆడతారు.
Also Read : భారత్ పరాజయం గవాస్కర్ ఆగ్రహం