Gujarat Titans Win : గుజరాత్ జైత్రయాత్ర ఐపీఎల్ జగజ్జేత
7 వికెట్ల తేడాతో రాజస్తాన్ పై గ్రాండ్ విక్టరీ
Gujarat Titans Win : హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్(Gujarat Titans Win) ఐపీఎల్ 2022 టైటిల్ ను దర్జాగా కైవసం చేసుకుంది. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో సత్తా చాటింది. ఒక రకంగా గుజరాత్ చెప్పి కొట్టింది 15వ సీజన్ టైటిల్ ను.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ సంజూ శాంసన్ తీసుకున్న నిర్ణయం కొంప ముంచింది. ఆర్సీబీని మట్టి కరిపించి దుమ్ము రేపిన రాజస్తాన్ రాయల్స్ ఫైనల్ మ్యాచ్ లో పూర్తిగా తేలి పోయింది.
చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచింది. ప్రధానంగా గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు సాధించాడు. ఇక గుజరాత్ బౌలర్లు రాజస్తాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.
దీంతో పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డారు. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేశారు. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans Win) ఆడుతూ పాడుతూ టార్గెట్ ఛేదించింది.
వృద్ది మాన్ సాహా ఔట్ అయినా ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. చివరలో వెనుదిరిగాడు చాహల్ బౌలింగ్ లో. ఇక శుభ్ మన్ గిల్ , డేవిడ్ మిల్లర్ గుజరాత్ టైటాన్స్ కు చిరస్మరణీయమైన విజయం సాధించారు.
15వ సీజన్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆది నుంచీ అద్భుతమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తూ దుమ్ము రేపుతూ వచ్చింది. చివరకు టైటిల్ చేజిక్కించుకుంది. సమిష్టి విజయంతో సత్తా చాటింది.
జగజ్జేతగా నిలిచింది. టోర్నీలో దుమ్ము రేపుతూ వచ్చిన జోస్ బట్లర్ , కెప్టెన్ సంజూ శాంసన్ తో పాటు ఎవరూ ఆశించిన మేర రాణించ లేక పోవడం ఆ జట్టుకు శాపంగా మారింది.
Also Read : ముగింపు వేడుకల్లో రెహమాన్ సందడి