GT vs DC : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్(GT vs DC) విజయం సాధించింది. టైటిల్ ఫెవరేట్ గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి మూటగట్టుకుంది.
14 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 172 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ను గుజరాత్ బౌలర్లు కట్టడి చేశారు. రన్స్ తీసేందుకు నానా తంటాలు పడ్డారు.
కట్టుదిట్టమైన బౌలింగ్ దెబ్బకు ఢిల్లీ చేష్టలుడిగింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 157 పరుగుగలు మాత్రమే చేసింది.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ ఒక్కడే 43 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఇక పంత్ తో పాటు పావెల్ 20, లలిత్ యాదవ్ 26 పరుగులు చేసి రాణించారు. కానీ చివరి వరకు చేసిన ప్రయత్నం ఫలితంచ లేదు.
ఎప్పుడైతే పంత్ వెనుదిరిగాడో అప్పుడే ఓటమి ఖాయమై పోయింది.
ఇక ఎలాంటి పర్ ఫార్మెన్స్ లేకున్నా గుజరాత్ యాజమాన్యం హార్దిక్ పాండ్యాకు కెప్టెన్ గా ఛాన్స్ ఇచ్చింది. దీంతో క్రికెట్ వర్గాలు విస్తు పోయాయి.
కానీ వారందరి అపనమ్మకాన్ని కొట్టి పారేస్తూ గుజరాత్ టైటాన్స్(GT vs DC) కు విజయాలు చేకూర్చి పెడుతున్నాడు పాండ్యా.
ఇక టైటాన్స్ బౌలర్లలో ఫెర్గూసన్ 4 వికెట్లు తీసి సత్తా చాటితే, షమీ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు.
ఇదిలా ఉండగా తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ను మట్టి కరిపించింది గుజరాత్ టైటాన్స్. ఎక్కడా తగ్గడం లేదు ఈ టీం.
Also Read : మహిళా వరల్డ్ కప్ విజేత ఆసిస్