SRH vs GT : ఎవరూ ఊహించని రీతిలో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ (SRH vs GT)సంచలన విజయాలు నమోదు చేస్తోంది. లీగ్ మ్యాచ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన కీలక మ్యాచ్ రసవత్తరంగా జరిగింది.
ఆఫ్గనిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ తన సత్తా ఏమిటో చూపించాడు. ఫినిషర్ గా మారాడు. గెలవదని అనుకున్న గుజరాత్ ను విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇదే సమయంలో రాహుల్ తెవాటియా సైతం మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. మార్కో జేన్సన్ కు చుక్కలు చూపించాడు. ఆఖరు ఓవర్ లో అనుకున్నది సాధించి పెట్టాడు రషీద్ ఖాన్.
విచిత్రం ఏమిటంటే ఖాన్ ఇప్పటి వరకు సన్ రైజర్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవలి వేలం పాటలో గుజరాత్ టైటాన్స్(SRH vs GT) కైవసం చేసుకుంది. మరో వైపు 4 ఓవర్లు వేసి 35 రన్స్ ఇచ్చాడు.
అత్యంత చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచాడు.కానీ బ్యాటింగ్ లో మెరిశాడు. కేవలం 11 బంతులు మాత్రమే ఆడిన రషీద్ ఖాన్ 31 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. ఇందులో 4 సిక్సర్లు ఉన్నాయి.
ఆఖరి ఓవర్ (20) జేన్సన్ వచ్చాడు. మొదటి బంతికి రాహుల్ తెవాటియా సిక్స్ కొట్టాడు. రెండో బాల్ కు సింగ్ వచ్చింది. ఇక రషీద్ ఖాన్ వరుసగా 6, 0, 6, 6 సిక్స్ లతో హోరెత్తించాడు.
లాస్ట్ బాల్ 3 పరుగులు చేస్తే గెలుస్తుంది. ఈ తరుణంలో ఆ బంతిని బౌండరీ లైన్ దాటించాడు. దీంతో 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది గుజరాత్ టైటాన్స్.
Also Read : ఐపీఎల్ నిబంధనల్లో మార్పు అవసరం