Gujarat Titans Band : దుమ్ము రేపుతున్న ‘గుజ‌రాత్’ బ్యాండ్

ప్లే ఆఫ్స్ కు చేరుకున్న ఆనందం

Gujarat Titans Band : ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న 15వ సీజ‌న్ ఐపీఎల్ 2022 ఆఖ‌రి అంకానికి చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 13 మ్యాచ్ లు

ఆడిన ఈ జ‌ట్టు 10 మ్యాచ్ ల‌లో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసి 20 పాయింట్లో టాప్ లో నిలిచింది.

రెండో స్థానంలో ల‌క్నో చేరుకుంది. ఇక ఈ రెండు జ‌ట్లు ఈసారి సీజ‌న్ లో కొత్త‌గా ఎంట్రీ ఇచ్చాయి. వ‌చ్చీ రావ‌డంతోనే దుమ్ము రేపుతున్నాయి.

ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు చుక్క‌లు చూపుతున్నాయి.

అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ స‌త్తా చాటుతూ టైటిల్ వేట‌కు రెడీ అయ్యాయి. గుజ‌రాత్ కు హార్దిక్ పాండ్యా నాయ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ బౌల‌ర్ ఆశిష్ నెహ్రా ఆ జ‌ట్టుకు హెడ్ కోచ్ గా ఉన్నాడు.

ఇక ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 14 మ్యాచ్ లు ఆడి 18 పాయింట్ల‌తో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఈ జ‌ట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్ కాగా భార‌తీయ జ‌న‌త పార్టీకి చెందిన ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ హెడ్ కోచ్ గా ఉన్నాడు.

ఈ త‌రుణంలో వ‌రుస విజ‌యాల‌తో దుమ్ము రేపుతున్న గుజ‌రాత్ టైటాన్స్ ఫుల్ జోష్ లో ఉంది. హార్దిక్ పాండ్యా ఇత‌ర ఆట‌గాళ్ల‌తో క‌లిసి గుజ‌రాత్ బ్యాండ్(Gujarat Titans Band) గా ఏర్ప‌డ్డారు.

ఇక ఇండియాను ఒక ఊపు ఊపేసిన ధ‌నుష్ పాడిన వై దిస్ కొల‌వ‌రి పాట‌ను పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం పాండ్యా అండ్ టీం పాడుతున్న పాటను గుజ‌రాత్ టైటాన్స్ మేనేజ్ మెంట్ త‌న అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేసింది.

ప్ర‌స్తుతం ఇది నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. మొత్తంగా గుజరాజ్ ఆట‌గాళ్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఎలాగైనా స‌రే ఐపీఎల్ టైటిల్ ఎగ‌రేసుకు పోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

Also Read : గుజ‌రాత్ బెంగ‌ళూరు బిగ్ ఫైట్

Leave A Reply

Your Email Id will not be published!