CSK vs GT : డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది గుజరాత్ టైటాన్స్(CSK vs GT) . ఐపీఎల్ 2022 మెగా టోర్నీ లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగింది.
మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగులు చేసింది. దీంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆడుతూ పాడుతూ గెలుపొందింది.
17 ఓవర్లు ముగిసే సరికి మ్యాచ్ మొత్తం చెన్నై చేతిలో ఉండగా ఆఫ్గనిస్తాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఆట స్వరూపాన్ని మార్చేశాడు. ఓ వైపు డేవిడ్ మిల్లర్ రఫ్పాడిస్తే ఇంకో వైపు రషీద్ ఖాన్ చెలరేగి పోయాడు.
కేవలం 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రషీద్ ఖాన్ 2 ఫోర్లు 3 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. మొత్తం 40 పరుగులు చేశాడు. కేవలం ఒకే ఒక్క ఓవర్ చెన్నై కొంప ముంచింది. జోర్డాన్ వేసిన 18వ ఓవర్ లో రన్స్ పిండుకున్నాడు.
ఈ ఒక్క ఓవర్ లో జీవితాంతం గుర్తుండి పోయేలా షాట్స్ ఆడాడు. 6, 6, 4, 6, 1, 2 పరుగులు వచ్చాయి. అంటే ఈ ఓవర్ లోనే గుజరాత్ కు 25 రన్స్ వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు రషీద్ ఖాన్ ఎంత విధ్వంసకరంగా ఆడాడో.
ఇక మ్యాచ్ లో మరో ప్లేయర్ మిల్లర్ 51 బంతులు మాత్రమే ఎదుర్కొని 8 ఫోర్లు 6 సిక్సర్లతో దంచి కొట్టాడు. 94 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇదిలా ఉండగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.
Also Read : రుతురాజ్ సూపర్ రాయుడు బెటర్