CSK v GT : ఐపీఎల్ 2022 రిచ్ టోర్నీలో భాగంగా ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(CSK v GT) నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.
వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్ స్కిప్పర్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మైదానంలోకి దిగిన రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా ఆడాడు.
ఏకంగా 73 పరుగులు చేశాడు. ఇక అంబటి రాయుడు సైతం రాణించాడు. 46 పరుగులు చేశాడు. వీరిద్దరూ త్వరగా అవుట్ కావడంతో సీఎస్కే స్కోర్ చేయలేక పోయింది.
ఇక చెన్నై బ్యాటర్లను పరుగులు చేయకుండా కట్టడి చేయడంలో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు సక్సెస్ అయ్యారు. ఇక ఈ జట్టు తరపున అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు తీయగా మహ్మద్ షమీ , యశ్ దయాల్ చెరో వికెట్ తీశారు.
ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ కు గుజరాత్ టైటాన్స్ 37 పరుగుల తేడాతో ఓడించింది. కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇక హార్దిక్ పాండ్యా ముందుండి నడిపించాడు తన జట్టును. రవీంద్ర జడేజా 22 పరుగులు చేశాడు.
ఇక రుతురాజ్ కేవలం 48 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. టీమ్ పరంగా టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాయుడు 31 బంతులు ఆడాడు. సీఎస్కే కెప్టెన్ 12 బంతులు ఎదుర్కొన్నాడు.
ఇదిలా ఉండగా సీఎస్కే ఇప్పటి వరకు 5 మ్యాచ్ లు ఆడింది . నాలుగు మ్యాచ్ లలో ఓటమి పాలైంది. ప్రస్తుతం పాండ్యా వర్సెస్ జడేజా మధ్యన వ్యక్తిగత పోరులో ఎవరు గెలుస్తారనేది వేచి చూడాలి.
Also Read : పంజాబ్ పరేషాన్ హైదరాబాద్ జోర్దార్