Gun Shots Washington DC : వాషింగ్ట‌న్ డీసీలో కాల్పుల మోత

భ‌యంతో ప‌రుగులు తీసిన జ‌నం

Gun Shots Washington DC : అమెరికాలో మ‌ళ్లీ కాల్పుల మోత క‌ల‌క‌లం రేపింది. వాషింగ్ట‌న్ డీసీ(Gun Shots Washington DC) లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. కాల్పుల ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో భ‌యంతో ప‌రుగులు తీశారు జ‌నం. ఈ క్లిప్ ను తాజాగా యుఎస్ లోని పోలీస్ యూనియ‌న్ నేష‌న‌ల్ ప్రాట‌ర్న‌ల్ ఆర్డ‌ర్ ఆఫ్ పోలీస్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది.

విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు కాల్పుల్లో ఇద్ద‌రు పౌరులు ఒక యువ‌కుడు చ‌ని పోయాడ‌ని, ఓ పోలీస్ అధికారితో పాటు ప‌లువురు గాయ‌ప‌డిన‌ట్లు తెలిసింది.

పూర్తిగా ఇది ర‌ద్దీగా ఉండే ప్రాంతం. అక్క‌డ అనేక పోలీసు వాహ‌నాలు కూడా కొలువు తీరి ఉన్నాయి. కానీ కాల్పుల ఘ‌ట‌నను మాత్రం అడ్డుకోలేక పోయారు.

ఈ ఘ‌ట‌న కంటే ముందు ప‌లు కాల్పుల సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ప‌రిస్థితిని కంట్రోల్ చేసే ప‌రిస్థితి లేదు. విచిత్రం ఏమిటంటే అమెరికా దేశంలో ప్ర‌జ‌ల కంటే ఎక్కువ‌గా గ‌న్స్ ఉన్నాయ‌ని స‌మాచారం.

ఆ దేశం ఆయుధాల‌ను న‌మ్ముకుంది. వాటినే దేశాల‌కు అమ్ముతూ గ‌డుపుతోంది. చివ‌ర‌కు తానే గ‌న్ క‌ల్చ‌ర్ కు బ‌లై పోయే స్థితికి చేరుకుంది. అప్ప‌టి వ‌ర‌కు కాల్పుల శ‌బ్దం వినిపించింద‌ని పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు చ‌నిపోగా తీవ్రంగా గాయ‌ప‌డిన పోలీస్ అధికారి, ఇద్ద‌రు బాధితులు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

వారు కోలుకుంటున్నార‌ని మెట్రో పాలిట‌న్ పోలీస్ డిపార్ట్ మెంట్ చీఫ్ రాబర్ట్ జె కాంటె తెలిపారు.

Also Read : మెజారిటీని కోల్పోయిన ఫ్రెంచ్ చీఫ్ మాక్రాన్

Leave A Reply

Your Email Id will not be published!